IRCTC Tour: హైదరాబాద్ టూ లద్దాఖ్.. ఐఆర్సీటీసీ టూరిజం ట్రావెల్ ప్యాకేజ్.. పూర్తి వివరాలు

|

Jun 14, 2022 | 3:43 PM

IRCTC Tour: గత కొంత కాలంగా భారతీయ రైల్వే సంస్థ దేశంలో సరికొత్త టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ అందాలను సైతం చూడాలనుకునే వారికోసం టూర్ ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది.

IRCTC Tour: హైదరాబాద్ టూ లద్దాఖ్.. ఐఆర్సీటీసీ టూరిజం ట్రావెల్ ప్యాకేజ్.. పూర్తి వివరాలు
Irctc Tour
Follow us on

IRCTC Tour: గత కొంత కాలంగా భారతీయ రైల్వే సంస్థ దేశంలో సరికొత్త టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ అందాలను సైతం చూడాలనుకునే వారికోసం టూర్ ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో పర్యటన చేయవచ్చు. హిమాలయ శిఖరాల మధ్య ఉన్న పీఠభూమి ప్రాంతమైన లద్దాఖ్ ను సందర్శించాలని దేశంలోని అనేక ప్రాంతాల పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం ఇందుకోసం జూన్ 16, జూలై 7న ప్యాకేజీ ప్రారంభమౌతోంది. ఇందులో భాగంగా పర్యాటకులు ఆరు రాత్రులు, ఏడు రోజుల పాటు లద్దాఖ్, షామ్ వ్యాలీ, నుబ్రా, టుర్టుక్, పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాలను సందర్శిస్తారని తెలుస్తోంది.

ముందుగా ఈ ప్రయాణం హైదరాబాద్ లో విమాన ఎక్కటంతో ప్రారంభమౌతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమై వారు లేహ్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. ఆ తరువాత అక్కడి స్థానిక మార్కెట్లలో షాపింగ్ కు వెళతారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తరువాతి రోజు శ్రీనగర్ హైవే మీదుగా లేహ్ చుట్టుపక్కల ఉండే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ టూర్ లో భాగంగా.. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారతదేశం గెలుచుకున్న గ్రామాన్ని కూడా పర్యాటకులు చూస్తారు. ఆ తరువాత చైనా- భారత ఆర్మీకి కీలకమైన పాంగాంగ్ లేక్ ను టూరిస్టులు సందర్శిస్తారు. ఇలా ఆరు రోజులు ప్యాకేజ్ పూర్తయిన తరువాత తిరిగి హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ఐఆర్‌సీటీసీ టూరిజం లేహ్ లద్దాఖ్ టూర్ ప్యాకేజీ ధర రూ.38,470 నుంచి ప్రారంభమవుతుంది. ఇది అత్యధికంగా రూ.44,025 ధర ఉంది. ఈ టూర్ ప్యాకేజ్ కింద ఫ్లై్ట్ టికెట్ల నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ వరకు అన్నింటితో కలుపుకుని ఉంటుంది. ప్రయాణ సమయంలో ఆహారం, స్టే వంటి వాటి ఖర్చులు ఇందులో భాగమేనని తెలుస్తోంది.