IRCTC Lost Tickets: టిక్కెట్లు పొగోట్టుకున్న వారికి శుభవార్త చెప్పిన ఐఆర్‌సీటీసీ.. డూప్లికెట్ ప్రింట్ విధానం అమలు చేస్తామని ప్రకటన..

కొంత మంది రైల్వే టికెట్లను పొగొట్టుకుంటూ ఉంటారు. బుకింగ్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్ ఉంటే పర్లేదు ఆ అవకాశం కూడా లేకపోతే ఇంక ప్రయాణించడానికి వీలు ఉండదు. ఈ కష్టాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

IRCTC Lost Tickets: టిక్కెట్లు పొగోట్టుకున్న వారికి శుభవార్త చెప్పిన ఐఆర్‌సీటీసీ.. డూప్లికెట్ ప్రింట్ విధానం అమలు చేస్తామని ప్రకటన..
Irctc Password

Updated on: May 21, 2023 | 8:00 PM

సాధారణంగా ముందస్తుగా ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి రైలును ఆశ్రయిస్తారు. సాధారణంగా రైలులో టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ప్రయాణ టెన్షన్‌ నుంచి బయటపడడానికి ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకుంటారు. పెరిగిన టెక్నాలజీ ప్రకారం చాలా మంది ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం స్టేషన్‌లో తీసుకున్న టిక్కెట్లు త్వరగా కన్‌ఫామ్ అవుతాయనే ఉద్దేశంలో రైల్వే స్టేషన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కొంత మంది రైల్వే టికెట్లను పొగొట్టుకుంటూ ఉంటారు. బుకింగ్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు మెసేజ్ ఉంటే పర్లేదు ఆ అవకాశం కూడా లేకపోతే ఇంక ప్రయాణించడానికి వీలు ఉండదు. ఈ కష్టాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. పొగొట్టుకున్న టిక్కెట్లకు డూప్లికెట్ టిక్కెట్ ఇస్తామని పేర్కొంది. అయితే వాటికి నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. డూప్లికెట్ టిక్కెట్ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.

భారతీయ రైల్వే టికెట్ పొగొట్టుకున్న ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటును అందిస్తోంది. కోల్పోయిన, తప్పిపోయిన, చిరిగిపోయిన లేదా మ్యుటిలేట్ అయిన వాటికి డూప్లికేట్ టిక్కెట్లను అందిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం ప్రయాణికులు రైల్వేకు కొంత మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ చార్ట్ సంకలనం చేయడానికి ముందు ధ్రువీకరించిన లేదా ఆర్ఏసీ టికెట్ కోల్పోతే సెకండ్ క్లాస్, స్లీపర్-క్లాస్ ప్రయాణీకులకు రుసుము రూ. 50, మిగిలిన ఇతర తరగతులకు రూ. 100 చొప్పున చెల్లించి నకిలీ టిక్కెట్‌ను పొందవచ్చు. అయితే రిజర్వేషన్ చార్ట్ రూపొందించిన తర్వాత టిక్కెట్ పొగొట్టుకుంటే మాత్రం అసలు టిక్కెట్ ధరలో 50 శాతం చెల్లించి నకిలీ టిక్కెట్‌ను పొందవచ్చు. డూప్లికెట్ టిక్కెట్ ఎలాం పొందాలో? ఓ సారి తెలుసకుందాం.

ఇవి కూడా చదవండి
  • రద్దుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ (ఆర్ఏసీ) టిక్కెట్లు చిరిగిపోయినా లేదా దెబ్బతిన్నా, భారతీయ రైల్వేలు 25 శాతం ఛార్జీని చెల్లించి నకిలీ టిక్కెట్‌ను జారీ చేయవచ్చు.
  • అయితే వెయిటింగ్ లిస్ట్‌లో దెబ్బతిన్న టిక్కెట్‌లకు డూప్లికేట్ టిక్కెట్లు మంజూరు చేయలేమని భారతీయ రైల్వే తెలిపింది.
  • అంతేకాకుండా, టిక్కెట్ చెల్లుబాటు, ప్రామాణికతను నిర్ధారించగలిగితే, చిరిగిపోయిన లేదా దెబ్బతిన్న రైలు టికెట్ వాపసుకు అర్హత పొందవచ్చు.
  • పోగొట్టుకున్న ఆర్ఏసీ టిక్కెట్ల కోసం, రిజర్వేషన్ చార్ట్ తయారు చేసిన తర్వాత డూప్లికేట్ టిక్కెట్లను సృష్టించరాదని రైల్వే తెలిపింది.
  • రైలు బయలుదేరే ముందు ఒరిజినల్ టిక్కెట్‌ను గుర్తించి డూప్లికేట్ టిక్కెట్‌తో పాటు అందిస్తే కస్టమర్ డూప్లికేట్ టిక్కెట్ ధరకు వాపసు పొందుతారని భారతీయ రైల్వే తెలిపింది.

మరిన్ని బిజినెస్ వా ర్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి