IRCTC News: ఇప్పుడు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే క్షణాల్లో డబ్బులు రీఫండ్‌.. iPay సేవలు ప్రారంభించిన IRCTC

|

Sep 15, 2021 | 3:28 PM

IRCTC News: మీరు రైలులో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి మీరు రైల్వే స్టేషన్‌కు

IRCTC News: ఇప్పుడు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే క్షణాల్లో డబ్బులు రీఫండ్‌.. iPay సేవలు ప్రారంభించిన IRCTC
Irctc Ipay
Follow us on

IRCTC News: మీరు రైలులో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవడం మంచిది. అయితే ఇప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. IRCTC ద్వారా నేరుగా మీ మొబైల్ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. చాలామంది తరుచుగా చేసే పని ఇదే. అయితే చాలా సార్లు మీ టికెట్ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండటం మనం గమనించవచ్చు. కొన్ని సమయాలలో టికెట్‌ కన్‌ఫర్మ్‌ కాకుండా మీ డబ్బు వాపసు రావడం జరుగుతుంది.

IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి సమయానికి టికెట్ రద్దు చేస్తే, చిన్న క్లరికల్ ఛార్జీలను తీసివేసి మొత్తం డబ్బు తిరిగి ఇస్తారు. రైల్వే నిబంధనల ప్రకారం మీరు టిక్కెట్ రద్దు చేయడం ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బు కట్‌ చేస్తారు. అయితే టికెట్ క్యాన్సిల్ చేయడం వల్ల మీకు రీఫండ్ చాలా ఆలస్యంగా వస్తుంది. కొన్నిసార్లు ఇది మూడు, నాలుగు రోజులు పట్టవచ్చు. కానీ ఇప్పుడు రైల్వే కొత్త యాప్‌ని ప్రవేశపెట్టింది. దీనిపేరు iPay. దీంట్లో మీరు చాలా తక్కువ సమయంలో మీ రీఫండ్‌ డబ్బులు పొందుతారు.

iPay అంటే ఏమిటి?
IRCTC.. iPay పేరుతో కొత్త సేవను ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు తక్కువ సమయంలో టికెట్‌ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు వారు రీఫండ్ కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. వెంటనే డబ్బులు రిఫండ్ అవుతాయి.

IRCTC సొంత చెల్లింపు గేట్‌వే
IRCTC ప్రకారం ఇంతకుముందు కంపెనీకి దాని సొంత చెల్లింపు గేట్‌వే లేదు కానీ ఇప్పుడు ఐ-పే రూపంలో వచ్చింది. తరచుగా ప్రజలు Google Pay, Razor Pay, Paytm వంటి ఇతర చెల్లింపు గేట్‌వేలను ఉపయోగించాల్సి వచ్చింది. దానికి కూడా ఎక్కువ సమయం పట్టేది. టికెట్‌ రిఫండ్ విషయంలో చాలా ఆలస్యం జరిగేది. కానీ ఇప్పుడు అలా జరగదు. iPay పూర్తిగా సురక్షితమైనది.

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో ఈడీ ఆఫీసుకు సినీ తారల క్యూ.. సెల్ఫీల ఫ్యాన్స్ గోల..

ICAR Recruitment: ఐకార్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక.

Diwali Crackers: దీపావళి సంబరాల్లో బాణసంచాపై సంపూర్ణ నిషేధం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆ రాష్ట్ర సర్కార్