Sukanya Samriddhi Yojana: వేలల్లో పెట్టుబడితో లక్షల్లో రాబడి.. ఆ ప్రత్యేక పెట్టుబడి పథకంతోనే సాధ్యం

|

Jun 20, 2024 | 4:45 PM

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేసరికి పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను పెట్టుబడి వైపు ప్రోత్సహించేలా సుకన్య సమృద్ధి యోజన పథకం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ. 12,500 నెలవారీ పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 70 లక్షలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Sukanya Samriddhi Yojana: వేలల్లో పెట్టుబడితో లక్షల్లో రాబడి.. ఆ ప్రత్యేక పెట్టుబడి పథకంతోనే సాధ్యం
Money Horoscope
Follow us on

మారుతున్న కాలంలో పెరుగుతున్న ఖర్చులు ఆడపిల్లల తల్లిదండ్రులకు కొత్త ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్ల భవిష్యత్ కోసం కోసం పెద్ద కలలు కంటారు. ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అదే సమయంలో తమ కుమార్తె వివాహాన్ని కూడా ఒక ముఖ్యమైన బాధ్యతగా భావిస్తారు. అయితే రెండు ప్రయోజనాల కోసం ఒక పెద్ద మొత్తం అవసరం. అయితే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి నెలనెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఆడపిల్ల పెళ్లీడుకు వచ్చేసరికి పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులను పెట్టుబడి వైపు ప్రోత్సహించేలా సుకన్య సమృద్ధి యోజన పథకం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రూ. 12,500 నెలవారీ పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో రూ. 70 లక్షలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల విద్య మరియు వివాహానికి ఉద్దేశించిన చిన్న పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ ఎస్ఎస్‌వై స్కీమ్ 8.2 శాతం వడ్డీ రేటును వార్షికంగా లెక్కించి, సమ్మేళనం చేస్తుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద సంరక్షకుడు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 పెట్టుబడితో ఎస్ఎస్‌వై ఖాతాను తెరవవచ్చు. ఓ ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 1.50 లక్షలుగా ఉంటుంది. ఒక నెలలో లేదా ఆర్థిక సంవత్సరంలో ఎన్ని డిపాజిట్లు అయినా చేసే అవకాశం ఉంటుంది.ఈ పథకం కోసం లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలుగా ఉంటుంది. 15 ఏళ్లు పూర్తయిన తర్వాత బాలికకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎవరైనా డబ్బు తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత లేదా ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి సమయంలో మూసివేయవచ్చు.

రూ.70 లక్షల రాబడి ఇలా

మీరు మీ ఆడపిల్ల కోసం రూ. 70 లక్షల ఫండ్‌ని లక్ష్యంగా పెట్టుకుంటే మీరు నెలకు రూ. 12,500 లేదా ఆర్థిక సంవత్సరంలో రూ. 1,50,000 పెట్టుబడి పెట్టాలి. 15 సంవత్సరాలలో, మీ మొత్తం పెట్టుబడి రూ. 22,50,000 అవుతుంది. 8.20 శాతం వడ్డీ రేటుతో, మీరు 46,77,578 రాబడిని పొందుతారు. అంటే మెచ్యూరిటీ సమయంలో, మీరు మొత్తం రూ. 69,27,578 లేదా దాదాపు రూ. 70 లక్షలు పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి