
డబ్బును తెలివిగా, సరైన చోట పెట్టుబడి పెడితే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా చిన్న పొదుపు పథకాల వంటి సురక్షిత మార్గాలను ఎంచుకుంటారు. అయితే ఇవి పరిమిత రాబడిని మాత్రమే ఇస్తాయి. కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా కొన్ని సంవత్సరాలలోనే లక్షాధికారిగా మారడానికి తోడ్పడే అద్భుతమైన పెట్టుబడి ప్రణాళిక గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మ్యూచువల్ ఫండ్ పథకాలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెట్టడం. ఈ రంగం మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే మంచి ఆదాయం లభిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో లక్షలాది రూపాయలు కూడబెట్టుకోవడానికి మొదటి అడుగు మంచి మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకోవడం. దీనికోసం ఆర్థిక నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
మీరు నెలకు కేవలం రూ.10,000 చొప్పున SIP పెట్టి, దానిని 30 సంవత్సరాల పాటు కొనసాగించినట్లయితే మీకు వచ్చే ఆదాయం ఇలా ఉంటుంది.
ఈ పెట్టుబడి 30 ఏళ్లపాటు పాటు ప్రతి సంవత్సరం 12శాతం ఆదాయాన్ని సంపాదిస్తే, మెచ్యూరిటీ సమయంలో మీరు అందుకునే మొత్తం రూ.3.52 కోట్లు వరకు ఉంటుంది. ఈ భారీ మొత్తం భవిష్యత్తులో మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందించి, మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.
(Disclaimer: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ముందస్తు సమాచారం లేకుండా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వలన గణనీయమైన నష్టాలు సంభవించవచ్చు.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి