Telugu News Business Interest rates offered by banks on fixed deposits, check details in telugu
Fixed deposits: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీతో అధిక ఆదాయం.. నమ్మలేని వడ్డీ రేటు ఇదే..!
ప్రజలకు నమ్మకమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లదే (ఎఫ్ డీలు) ఎప్పుడూ అగ్రస్థానం. వివిధ బ్యాంకులు అందించే ఎఫ్ డీలపై ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. వివాహం, చదువు, భవిష్యత్తు అవసరాల కోసం ఈ పథకాలతో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఆధునిక కాలంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ తదితర ఎన్నో పెట్టుబడి పథకాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా ఎఫ్ డీలపైనే ప్రజలకు నమ్మకం ఎక్కువ. అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపోరేటును తగ్గించడంతో అన్ని బ్యాంకులు తమ వడ్డీరేట్లను కిందకు దించాయి. దీంతో ఎఫ్ డీలపై కూడా వడ్డీరేటు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రూ.3 కోట్ల డిపాజిట్లపై హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీఐ అందిస్తున్నవడ్డీరేటు వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్ణీత కాలానికి వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశమున్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు ఎక్కువ ఆధారపడతారు. వాటి నుంచి వచ్చే వడ్డీరేటు లెక్కించుకుని, ఎక్కువ ఇచ్చే బ్యాంకులో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. కాగా.. రూ.3 కోట్ల డిపాజిట్లపై కాలపరిమితి ఆధారంగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో 7.75 శాతం, ఐసీఐసీఐలో 7.85 శాతం, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 7.50 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్ డీఎఫ్ సీ
ఏడు రోజుల నుంచి 14 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ అందిస్తున్నారు.
ఏడాది నుంచి 15 నెలల కంటే తక్కు కాలపరిమితి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం.
రెండేళ్ల నుంచి 2 ఏళ్ల 11 నెలల కన్నా తక్కువ సమయంలో సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
మూడేళ్ల నుంచి నాలుగేళ్ల ఏడు నెలల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
ఐదేళ్ల ఒక్క రోజు నుంచి పదేళ్ల వరకూ సాధారణ ప్రజలకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.
స్టేట్ బ్యాంకు
ఏడు రోజుల నుంచి 45 రోజుల వరకూ సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం వడ్డీ అందిస్తారు.
ఏడాది నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలపరిమితికి సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం.
రెండేళ్ల నుంచి మూడేళ్ల కంటే తక్కువ సమయం డిపాజిట్లపై 6.90 శాతం, 7.40 శాతం
మూడేళ్ల నుంచి ఐదేళ్ల డిపాజిట్లపై 6.75 శాతం, 7.25 శాతం.
ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ సాధారణ ప్రజలకు 6.50 శాతం, సినియర్ సిటిజన్లకు7.50 శాతం వడ్డీ ఇస్తారు.
ఐసీఐసీఐ
ఏడు నుంచి 29 రోజుల వరకూ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం.
ఏడాది నుంచి 15 నెలల కంటే తక్కువ సమయానికి 6.70 శాతం, 7.20 శాతం.
18 నెలల నుంచి రెండేళ్ల వరకూ 7.25 శాతం, 7.75 శాతం.
రెండేళ్ల ఒక్క రోజు నుంచి ఐదు సంవత్సరాల వరకూ 7 శాతం, 7.50 శాతం.
ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వడ్డీ అందిస్తారు.