సందిగ్ధతను తొలగించిన నిర్మలా సీతారామన్, ఇప్పటివరకూ ఉన్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ

|

Apr 01, 2021 | 10:05 AM

Interest rates of small savings schemes : చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది..

సందిగ్ధతను తొలగించిన నిర్మలా సీతారామన్, ఇప్పటివరకూ ఉన్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ
Nirmala Sitharaman
Follow us on

Interest rates of small savings schemes : చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అమలవుతున్న వడ్డీరేట్లు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు, దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన ఆదేశాల్ని కేంద్ర వెనక్కి తీసుకుంది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ లో తెలిపారు.

కాగా, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి వర్తించనున్నాయని కూడా తెలిపింది. జూన్‌ 30 వరకు ఈ వడ్డీ రేట్లు అమల్లో ఉంటాయని పేర్కొంది. సదరు ఉత్తర్వుల ప్రకారం పొదుపు ఖాతా, పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోచనా, కిసాన్‌ వికాస్‌ పత్ర ఇలా అన్నింటిపైనా వడ్డీ రేట్లలో కోత విధించారు.

కేంద్రం గత మూడు త్రైమాసికాల నుంచి వడ్డీ రేట్లను మార్చలేదు.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక ప్రాతిపదికన చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంటుంది. తాజాగా ఈ వడ్డీరేట్లను సవరించింది. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయంతో పునరాలోచనలో పడిన కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రే ఈ ఉదయం ఒక సుస్పష్టమైన ప్రకటన విడుదల చేయడం విశేషం.

ఇలా ఉంటే, నిన్న ఆర్థిక శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం సేవింగ్స్‌ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు మొదటిసారి 4% నుంచి 3.5 శాతానికి తగ్గించారు. ఏడాది టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటు 5.5% నుంచి 4.4 శాతానికి, రెండేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.5 నుంచి 5.0 శాతానికి, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.5 నుంచి 5.1 శాతానికి, ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై వడ్డీని 6.7 నుంచి 5.8 శాతానికి, ఐదేళ్ల రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీని 5.8% నుంచి 5.3 శాతానికి, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌పై వడ్డీని 7.4% నుంచి 6.5 శాతానికి తగ్గించారు.

ఇక,  నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై వడ్డీని 6.8% నుంచి 5.9 శాతానికి, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ స్కీమ్‌పై వడ్డీని 7.1% నుంచి 6.4 శాతానికి, కిసాన్‌ వికాసపత్రపై 6.9 (124 నెలల్లో మెచ్యూరిటీ) శాతం నుంచి 6.2 (138 నెలల్లో మెచ్యూరిటీ) శాతానికి, సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీని 7.6% నుంచి 6.9 శాతానికి తగ్గించారు. అయితే, ఇవన్నీ ఇప్పుడు పాత వడ్డీ రేట్ల ప్రకారమే అమల్లో ఉంటాయని పొదుపుదారులు గమనించాలి.

Read also : West Bengal Election 2021 : బెంగాల్‌ రాజకీయ భవిష్యత్‌ను తేల్చే కీలక సంగ్రామం మొదలైంది, ఈ దశ ఎందుకంత సమస్యాత్మకం.?