చాలా ఏళ్లుగా ఫిక్స్డ్ డిపాజిట్లు భారతదేశంలో ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ముఖ్యంగా సంప్రదాయవాద పెట్టుబడిదారులు, సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీల్లో పెట్టుబడిని ఇష్టపడుతూ ఉంటారు. ఈ పెట్టుబడిదారులు అధిక రాబడి కంటే హామీ ఇచ్చే రాబడి, మూలధన భద్రత, సులభమైన లిక్విడిటీకి విలువ ఇస్తారు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పోస్టాఫీసులు, కార్పొరేట్ సంస్థలు అందిస్తాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేక ఫీచర్లు, వడ్డీ రేట్లు, ప్రయోజనాలను అందిస్తాయి. కార్పొరేట్ ఎఫ్‌డీలు ప్రత్యేకించి తరచుగా బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఏయే ఫైనాన్స్ సంస్థలు ప్రస్తుతం ఎఫ్‌డీలపై అధిక వడ్డీను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
మహీంద్రా ఫైనాన్స్ సాధారణ కస్టమర్లకు సంవత్సరానికి 7.4 శాతం, 8.1 శాతం మధ్య ఎఫ్‌డీ రేట్లను, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం, 8.35 శాతం మధ్య అందిస్తుంది. ఈ రేట్లు 1 నుండి 5 సంవత్సరాల వరకు నిబంధనల మేరకు అందిస్తూ ఉంటారు.
ముత్తూట్ క్యాపిటల్ ఎన్‌బీఎఫ్‌సీ సాధారణ ప్రజలకు సంవత్సరానికి 7.21 శాతం నుంచి 8.38 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 7.71 శాతం నుండి 8.88 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 1 నుండి 5 సంవత్సరాల వరకు అందిస్తుంది.
శ్రీరామ్ ఫైనాన్స్ వివిధ కాల వ్యవధిలో ఆకర్షణీయమైన ఎఫ్‌డీ రేట్లను అందిస్తుంది. ఐదు సంవత్సరాల కాలవ్యవధికి సాధారణ కస్టమర్లు 8.47 శాతం వడ్డీ రేటును అందుకుంటారు. సీనియర్ సిటిజన్లు 8.97 శాతం అధిక రేటును పొందుతారు. 3 సంవత్సరాల కాలానికి సాధారణ కస్టమర్లకు 8.38 శాతం, సీనియర్లకు 8.88 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. స్వల్పకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్న వారికి 1 సంవత్సరం ఎఫ్‌డీ సాధారణ కస్టమర్లకు 7.09 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.59 శాతం అందిస్తుంది.
బజాజ్ ఫైనాన్స్ సాధారణ ప్రజలకు సంవత్సరానికి 7.40 శాతం, 8.60 శాతం మధ్య వడ్డీ రేట్లతో ఎఫ్‌డీలను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.65 శాతం, 8.85 శాతం మధ్య ఉంటుంది. ఈ రేట్లు 1 నుంచి 5 సంవత్సరాల నిబంధనలకు వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్ ఇండియన్ డిపాజిటర్లు బజాజ్ ఫిన్ సర్వ్ ఎఫ్‌డీలు అని పిలిచే ఎఫ్‌డీల్లో 1 నుంచి 3 సంవత్సరాల వరకు 7.35 శాతం నుంచి 8.05 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
సుందరం హెూమ్ ఫైనాన్స్ సాధారణ ప్రజలకు 7.45 శాతం నుంచి 7.90 శాతం వరకు అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం నుంచి 8.25 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను 1 నుంచి 5 సంవత్సరాల వరకు అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..