ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో 74మంది కరోడ్‌పతులు

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌. ఇందులో పనిచేస్తున్నవారు అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా మారిపోయారు. ఇన్ఫోసిస్‌ కరోడ్‌పతి క్లబ్‌ నెంబర్ కూడా అదే స్థాయిలో పెరిగుతోంది....

ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల్లో 74మంది కరోడ్‌పతులు

Updated on: Jun 03, 2020 | 2:36 PM

సంస్థ పెరగటమే కాదు.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఇదే భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌. ఇందులో పనిచేస్తున్నవారు అధిక వేతన రాబడితో కరోడ్‌పతులుగా మారిపోయారు. ఇన్ఫోసిస్‌ కరోడ్‌పతి క్లబ్‌ నెంబర్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇలా ఎదిగిన వారిలో అత్యధికులు వైస్‌- ప్రెసిడెంట్‌, సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నవారే. ఇదే కంపెనీలో గత ఏడాది కోటీశ్వరుల సంఖ్య 60 … ఇప్పుడు ఆ కరోడ్‌పతుల జాబితా 74కి పెరిగింది. గతంలో తీసుకున్న షేర్లు ఈ ఏడాది కలిసిరావటంతో వాటి విలువ ఆధారంగా వార్షిక వేతన రాబడి మరింత పెరిగింది. దీంతో గత ఏడాది భారత్‌లోని ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉంది. భారత్‌లో అత్యధిక వేతనం అందుకుంటున్న వ్యక్తి కూడా ఈ సంస్థ ఐటీ సీఈఓ సలిల్‌ పరేఖ్‌ కావడం విశేషం. సీఈఓ సలిల్ పరేఖ్ పారితోషికం రూ. 34.27 కోట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది.