ఇండిగో తెచ్చిన పండగ… రూ.999కే విమాన టికెట్!

ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఇండిగో 13వ వార్షికోత్సవం సందర్బంగా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ధర నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభమౌతుంది. ఇండిగో 13వ వార్షికోత్సవ సేల్ ఆగస్ట్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు ఆగస్ట్ 15 నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఇండిగో […]

ఇండిగో తెచ్చిన పండగ... రూ.999కే విమాన టికెట్!

Edited By:

Updated on: Jul 31, 2019 | 2:54 PM

ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఇండిగో 13వ వార్షికోత్సవం సందర్బంగా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ విమాన టికెట్లను రూ.999 ధర నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణపు టికెట్ ధర రూ.3,499 నుంచి ప్రారంభమౌతుంది. ఇండిగో 13వ వార్షికోత్సవ సేల్ ఆగస్ట్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు ఆగస్ట్ 15 నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.

ఇండిగో 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ‘మా జర్నీకి తోడ్పాటునందించిన కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములకు కృతజ్ఞతలు. ప్రత్యేకమైన సందర్భంగా కారణంగా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించాం’ అని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియణ్ బౌల్టర్ తెలిపారు. ఇకపోతే ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు దారులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. యస్ బ్యాంక్ క్రెడిట్‌ కార్డు కలిగిన వారికి కూడా క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.