Indigo Baggage Service: సాధారణంగా విమాన ప్రయాణాలంటేనే ఎక్కువ దూరంతో కూడుకున్నవై ఉంటాయి. అందుకే విమానాల్లో ప్రయాణం చేసే వారు భారీ లగేజ్‌తో కనిపిస్తుంటారు. ఇందులో భాగంగా ఇంటి నుంచి ఎయిర్ పోర్ట్‌కు చేరుకునే క్రమంలో లగేజ్‌ను తీసుకెళ్లడం ఓ పెద్ద సమస్యగా మారుతుంది.
అంతటితో ఆగకుండా తీసుకెళ్లిన లగేజ్‌ను చెక్ ఇన్ దగ్గర వెయిట్ చెక్ చేయించి, బ్యాగులను స్కానింగ్ చేయించి బ్యాగేజీని కౌంటర్‌లో అప్పగించి.. మళ్లీ మన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత బ్యాగు వచ్చే వరకు వేచి చూడాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం. అలా కాకుండా ఎంచక్కా మీ ఇంటి దగ్గరకే వచ్చి మీ లగేజీని మీరు వెళ్లే ఫ్లైట్‌లో ఎక్కించి, మళ్లీ మీ గమ్యస్థానానికి చేరిస్తే బాగుంటుంది కదూ..! ప్రస్తుతం ఇలాంటి సేవలనే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఇండిగో.. డోర్-టు-డోర్ బ్యాగేజ్ ట్రాన్స్‌ఫర్ సర్వీస్‌ను ‘6ఇబ్యాగ్ పోర్ట్’ పేరుతో ప్రారంభించింది. ఈ సేవలను ముందుగా ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ప్రారంభించింది. ఇక మరో దశలో ఈ సేవలను కార్టర్‌పోర్టర్ అనే సంస్థతో కలిసి ముంబయి, బెంగళూరు నగరాల్లోనూ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. విమాన ప్రయాణానికి 24 గంటల ముందుగా ఈ సేవలను ప్రయాణికులకు అందిస్తారు. అయితే మీ లగేజ్ ఏమైపోతుందో అన్న బెంగ అవసరంలేకుండా.. ఈ సేవలతో పాటు ఒక్కో బ్యాగ్‌కు రూ.5000 ఇన్సూరెన్స్‌ను కూడా అందిస్తుందీ సంస్థ.
Also Read: Viral News: దొంగతానికి వెళ్తే.. కంటపడ్డ ఊహించనంత సొమ్ము.. వెంటనే దొంగకు గుండె నొప్పి.. కట్ చేస్తే..
viral video: చిన్నారి కళ్ళలో వేల కాంతులు.. అమ్మాయిగారి ఆశ్చర్యానికి కారణం ఏంటో తెలుసా..