ప్రపంచంలో అత్యుత్తమ సమయపాలన పాటించిన విమానాశ్రయాల జాబితా విడుదలైంది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ ఓఏజీ నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ సమయ పాలన పాటించే 20 విమానాశ్రయాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇండిగో, కోయంబత్తూరు విమానాశ్రయం చోటు దక్కించుకుంది. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో 15వ స్థానం ఉండగా, కోయంబత్తూరు విమానాశ్రయం 13వ స్థానం దక్కించుకుంది. ఇండిగో ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 83.51 శాతంగా నమోదు చేసుకోగా, 2019 సంవత్సరంలో 77.38 శాతంతో 54వ స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ 16వ స్థానం, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానం, వివా ఎయిర్ కొలంబియా 18వ స్థానం, ఎతిహాద్ ఎయిర్‌వేస్ 19వ స్థానం, ఎమిరేట్స్ 20 స్థానంలో ఉంది. ఇక గరుడ ఇండోనేషియా అగ్ర స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా కంపెనీ సఫైర్ రెండో స్థానం, జర్మనీ సంస్థ యూరోవింగ్స్ మూడో స్థానంలో నిలిచింది. థాయ్ ఇయిరేషియా నాలుగో స్థానం, దక్షిణ కొరియా సంస్థ జెజు ఎయిర్‌లైన్స్ ఐదో స్థానంలో నిలిచాయి.
అలాగే 2022 సంవత్సరంలో అత్యధికంగా షెడ్యూల్డ్ విమానాలను నడిపిన 20 కంపెనీలను మెగా ఎయిర్‌లైన్స్‌గా నివేదిక గుర్తించింది. టాప్-20 మెగా ఎయిర్‌లైన్స్‌లో ఓటీపీ పరంగా ఇండిగో 5వ స్థానంలో ఉండగా, నిప్పన్ ఎయిర్‌వేస్ 88.79 శాతంతో అగ్రస్థానంలో ఉంది. జపాన్ ఎయిర్‌లైన్స్ 88.07 శాతం, లాటమ్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ 85.03 శాతం, అజుల్ ఎయిర్‌లైన్స్ 84.87 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఇక తక్కువ ధర టికెట్‌తో నడిపే విమానయాన సంస్థల్లో ఇండిగోకు ఆరో స్థానం లభించింది. అంతర్జాతీయంగా ఓటీపీ పరంగా ఉత్తమ 20 విమానాశ్రయాల్లో కోయంబత్తూర్ విమానాశ్రయం 88.01 శాతం,కు 13 ర్యాంకు లభించింది. జపాన్‌కు చెందిన ఒసాకా అంతర్జాతీయ విమానాశ్రయం 91.45 శాతం ఓటీపీతో అగ్రస్థానం దక్కించుకుంది.
ఇక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టుల్లో అత్యంత సమయపాలన పాటించే వాటిలో కోయంబత్తూర్ విమానాశ్రయంకు 10వ ర్యాంకు లభించింది. షెడ్యూల్ సమయానికి 15 నిమిషాల కంటే తేడా లేకుండా రాకపోకలు సాగించడాన్ని ఓటీపీగా పరిగణిస్తారు. ఆయా విమానాలకు కేటాయించిన స్లాట్‌కు 15 నిమిషాల కంటే తేడాల లేకుండా రాకపోకలు సాగించడాన్ని పరిగణలోకి తీసుకుని జాబితాను తయారు చేస్తుంటారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..