Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.1,119కే విమానం ఎక్కేయండి… హోలీ గెట్‌వే సేల్ పేరుతో బంపర్‌ ఆఫర్‌

మీరు విమానం ఎక్కాలని ఆశ పడుతున్నారా? మీతో పాటు మీ తల్లిదండ్రులను సైతం విమానం ఎక్కించాలని ఎంతో కాలం నుంచి ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్‌ మీలాంటి వారి కోసమే అంటోంది ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో. హోలీ పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో బంపర్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రయాణికులు తక్కువ ధరలకే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు మంచి అవకాశం అని చెప్పింది. మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను

రూ.1,119కే విమానం ఎక్కేయండి... హోలీ గెట్‌వే సేల్ పేరుతో బంపర్‌ ఆఫర్‌
Indigo Flight
Follow us
K Sammaiah

| Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2025 | 11:01 AM

మీరు విమానం ఎక్కాలని ఆశ పడుతున్నారా? మీతో పాటు మీ తల్లిదండ్రులను సైతం విమానం ఎక్కించాలని ఎంతో కాలం నుంచి ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్‌ మీలాంటి వారి కోసమే అంటోంది ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో. హోలీ పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్‌. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో బంపర్‌ ఆఫర్లను తీసుకొచ్చింది. ప్రయాణికులు తక్కువ ధరలకే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు మంచి అవకాశం అని చెప్పింది. మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్‌ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఆఫర్ లో ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్‌ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్‌ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందుబాటులో ఉంచింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపును ఇస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ సీట్ సెలక్షన్‌లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని ఇండిగో కంపెనీ ప్రకటించింది.

ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్‌ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ విమానాల నెట్‌వర్క్‌ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ హోలీ గెట్ వే సేల్‌లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది.

నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
నాగ్‌పూర్‌ హింస వెనుక బంగ్లాదేశ్‌ హస్తం? ఫడ్నవీస్‌ ఏమన్నారంటే..
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
సినిమాలు డిజాస్టర్ అయినా కోట్ల ఆస్తి కూడబెట్టిన బ్యూటీ ఎవరంటే?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
కెకెఆర్‌కు అన్యాయం చేసిన అంపైర్లు?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి సందీప్ కిషన్ 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
ఏపీలో కొత్త పింఛన్లు వచ్చేస్తున్నాయ్.. ఎప్పటి నుంచి అంటే..?
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదు: కేసీఆర్
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక
ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 83% మంది నిరుద్యోగులుగానే.. నివేదిక
మ్యాచ్‌ అయితే గెలిచారు కానీ, ఈ లోపాలు గమనించారా?
మ్యాచ్‌ అయితే గెలిచారు కానీ, ఈ లోపాలు గమనించారా?
RCB vs KKR: బ్రాడ్‌కాస్టింగ్‌లో బిగినర్ మిస్టేక్స్!
RCB vs KKR: బ్రాడ్‌కాస్టింగ్‌లో బిగినర్ మిస్టేక్స్!
వారు ఫోన్ చేసి చంపేస్తామంటున్నారు .. వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
వారు ఫోన్ చేసి చంపేస్తామంటున్నారు .. వీడియో రిలీజ్ చేసిన అన్వేష్