Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. వడ్డీ రేట్ల పెంపే కారణమా..

|

Jun 14, 2022 | 10:03 AM

గత రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్‌ మార్కెట్ భారీ క్షీణతను చవిచూస్తోంది. మంగళవారం కూడా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. వడ్డీ రేట్ల పెంపే కారణమా..
Stock Market
Follow us on

గత రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్‌ మార్కెట్ భారీ క్షీణతను చవిచూస్తోంది. మంగళవారం కూడా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 350 పాయింట్లు పతనమై 52,495 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల పతనంతో 15,674 వద్ద ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు కూడా తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు.  ప్రారంభ ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్ వంటి షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్స్‌ ఇండెక్స్‌ 0.8 శాతం తగ్గింది. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.

రత్నమణి, ట్యూబ్స్‌ 2.5 శాతం పెరిగింది. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి స్టాక్‌లు క్షీణతను చూస్తున్నాయి.  సెన్సెక్స్ సోమవారం 2.68 శాతం, శుక్రవారం 1.84 శాతం నష్టపోయింది. ఈ రెండు ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.9.75 లక్షల కోట్లు నష్టపోయారు. అటు తర్వాతి మనిటరీ సమావేశంలో యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటన కోసం పెట్టుబడిదారులు వేచి చూస్తున్నారు.