షాకింగ్‌ న్యూస్‌.. దేశంలో చమురు నిల్వ! 10 రోజుల్లో అంతా ఫినిష్‌?

భారతదేశపు వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో 64 శాతం (3.372 మిలియన్ మెట్రిక్ టన్నులు) మాత్రమే ఉన్నాయి, ఇది కేవలం 9.5 రోజుల అవసరాలకు సరిపోతుంది. దేశం తన చమురు అవసరాల్లో 85 శాతం పైగా దిగుమతులపై ఆధారపడగా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాకు ముప్పుగా మారాయి.

షాకింగ్‌ న్యూస్‌.. దేశంలో చమురు నిల్వ! 10 రోజుల్లో అంతా ఫినిష్‌?
Crude Oil

Updated on: Mar 25, 2026 | 7:00 AM

భారతదేశపు వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు ప్రస్తుతం ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి 23న రాజ్యసభలో సమర్పించిన సమాచారం ప్రకారం దేశంలో సుమారు 3.372 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు నిల్వ ఉంది. ఇది మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో కేవలం 64 శాతం మాత్రమే. పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పటికీ, ఈ నిల్వలు కేవలం 9.5 రోజుల ముడి చమురు అవసరాన్ని మాత్రమే తీర్చగలవని మినిస్టీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ నేచ్యురల్‌ గ్యాస్‌ వెల్లడించింది. ప్రస్తుతం నిల్వలు పూర్తిగా నిండకపోవడంతో, వాస్తవంగా అందుబాటులో ఉన్న భద్రతా వ్యవధి ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌ (SPR) అనేవి సరఫరా అంతరాయాలు, యుద్ధాలు లేదా ధరల అకస్మాత్తు పెరుగుదల వంటి సంక్షోభ పరిస్థితుల్లో దేశానికి రక్షణగా నిలిచే అత్యవసర నిల్వలు. ముఖ్యంగా దిగుమతులపై అధికంగా ఆధారపడే భారతదేశం వంటి దేశాలకు ఇవి కీలకం. ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం కంటే ఎక్కువను దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమ ఆసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్ముజ్‌ ద్వారా చమురు రవాణా అంతరాయం కలిగే అవకాశంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ మార్గం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది.

భారతదేశపు SPR ప్రాజెక్టును అమలు చేయడానికి ఇండియన్‌ స్ట్రాటజిక్‌ పెట్రోలియం రిజర్వ్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నిల్వలు విశాఖపట్నం, మంగళూరు, పడూర్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. అదనంగా ఒడిశాలోని చండిఖోల్, అలాగే పడూర్‌లో విస్తరణ ప్రాజెక్టులు ప్రతిపాదించబడినప్పటికీ, ఇవి ఇంకా అమలులోకి రాలేదు. మొత్తం 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల విస్తరణ ప్రణాళిక ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం తన ఇంధన దిగుమతులను విభిన్న మార్గాల ద్వారా పొందుతూ సరఫరా భద్రతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us