JoB Alert: యువతకు గుడ్ న్యూస్.. 2030నాటికి ఆ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!

|

Jan 28, 2022 | 6:29 PM

రాబోయే యూనియన్ బడ్జెట్ ముఖ్యంగా రూఫ్‌టాప్ సోలార్, మినీ అండ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్‌ల వృద్ధికి, దేశీయ సోలార్ తయారీపై దృష్టి నిలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఈ రంగం కీలకంగా వ్యవహరించనుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

JoB Alert: యువతకు గుడ్ న్యూస్.. 2030నాటికి ఆ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు!
Renewable Energy Sector
Follow us on

మన దేశ పునరుత్పాదక ఇంధన రంగం (renewable energy sector)2030 నాటికి దాదాపు పది లక్షల మందికి ఉపాధిని కల్పించగలదని వివిధ అధ్యయనాలు తెలయజేస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న 1.1 లక్షల శ్రామిక శక్తి కంటే పది రెట్లు ఎక్కువ అని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (NRDC), స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ (SCGJ) గురువారం విడుదల చేసిన ఇండిపెండెంట్ స్టడీ తెలిపింది. అనేక కొత్త ఉద్యోగాలు చిన్న స్థాయి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా సృష్టించబడతాయని అధ్యయనం వెల్లడించింది.

“ఇండియాస్ ఎక్స్‌పాండింగ్ క్లీన్ ఎనర్జీ వర్క్‌ఫోర్స్” అధ్యయనం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. యుటిలిటీ లేదా సోలార్ పార్కుల వంటి భారీ-స్థాయి ప్రాజెక్టులతో పోలిస్తే రూఫ్‌టాప్ సోలార్ అండ్ మినీ, మైక్రో-గ్రిడ్ సిస్టమ్‌ల వంటి చిన్న-స్థాయి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ద్వారా చాలా కొత్త ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయని నొక్కిఒక్కానించింది.

CEEW-NRDC-SCGJ విశ్లేషణ కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉపాధి అవకాశాలను, ఈ రంగంపై కోవిడ్ మహమ్మారి ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలియజేసింది. 2019 ఆర్థిక సంవత్సరం (FY19)లో ఈ రంగంలో 12,400 మంది కొత్తగా ఉపాధి పొందగా, 2020 (FY20)లో కేవలం 5,200 మంది ఉపాధి పొందారు. ఇక 2021 (FY21)లో 6400 మంది ఉద్యోగాలు సాధించారు. గణాంకాల ప్రకారం 2021లో అత్యధిక మంది కొత్త కార్మికులు రూఫ్‌టాప్ సోలార్ సెగ్మెంట్‌లో నియమితులయ్యారు. వార్షిక ఉపాధి అవకాశాలు పునరుత్పాదక ఇంధన రంగంలో 2020 కంటే 2021లో తొమ్మిది శాతం పెరిగినట్లు తెలిపింది. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల కోసం నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యతను మెరుగుపరచడానికి 2015 మరియు 2017 మధ్యకాలంలో భారతదేశం సూర్యమిత్ర ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 78,000 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు అధ్యయనం పేర్కొంది.

రాబోయే యూనియన్ బడ్జెట్ ముఖ్యంగా రూఫ్‌టాప్ సోలార్, మినీ అండ్ మైక్రో గ్రిడ్ సిస్టమ్‌ల వృద్ధికి, దేశీయ సోలార్ తయారీపై దృష్టి నిలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అని సిఇఇడబ్ల్యు సిఇఒ డాక్టర్ అరుణాభా ఘోష్  ఈ సదర్భంగా అన్నారు.

Also Read:

Wipro hiring 2022: విప్రో బంపర్ ఆఫర్..! కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళా నిపుణులకు ఆహ్వానం పలుకుతోన్న ఐటీ సంస్థ..