
ప్రపంచ ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారతదేశంలో బంగారం ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులను చూపించాయి. ఈ క్రమంలోనే మే 10 ఉదయం నాటితో పోల్చితే.. దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. క్రితం రోజున భారీగా క్షీణించిన పసిడి ధరలు నేడు (మే 11) కాస్త ఎగిశాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశ ఎదురైంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,868లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 9,045లు పలుకుతోంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 7,401.లుగా ఉంది. మే 11 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి…
– ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,600, 24 క్యారెట్ల ధర రూ.98,830 గా ఉంది.
– ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.
– చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల రేటు రూ.98,680 గా ఉంది.
– బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.
– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,640 గా ఉంది.
– విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.
– విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.
వెండి ధరలు..
ఇక ఇవాళ్టి వెండి ధరల విషయానికి వస్తే..వెండి ధర గ్రాము 111లు ఉండా, కిలో వెండి ధర రూ.1,11,000లుగా పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..