Earth Energy Ev: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌లు.. మార్కెట్లో లాంచ్ చేసిన ఎర్త్ ఎనర్జీ..
Earth Energy Ev launched 3 electric two wheelers: ఎర్త్ ఎనర్జీ ఈవీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్సడ్ ఎలాక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు వినియోగదారులకు త్వరలోనే..
Earth Energy Ev launched 3 electric two wheelers: ఎర్త్ ఎనర్జీ ఈవీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్సడ్ ఎలాక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలు వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు మూడు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కోట్లో ప్రవేశపెట్టడంతోపాటు వివరాలు.. ఆన్-రోడ్ ధరలను కూడా ఎర్త్ ఎనర్జీ విడుదల చేసింది. భారతదేశంలో ఎర్త్ ఎనర్జీ గ్లైడ్ + ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .92,000 కాగా, ఎవాల్వ్ ఆర్ క్రూయిజర్ (బైక్) ధర రూ .1.30 లక్షలు. ఎవోల్వ్ జెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ (బైక్) ధర రూ.1.42 లక్షలు.
ఈ నెల చివరి నుంచి గ్లైడ్ + షోరూమ్‌లలో (స్కూటర్) లభించనుంది. ఎవాల్వ్ Z, R మోడళ్లు మార్చి చివరి నాటికి అందుబాటులో వస్తాయని ఎర్త్ ఎనర్జీ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 45 షోరూమ్‌లను దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఒకవేళ కావాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో రూ.1000తో వాహనాలను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వాహనాలు మార్కెట్‌లో రాగానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Also Read: