Nokia Earphones: నోకియా ప్రొఫెషనల్ ‘ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్’ విడుద‌ల‌.. స్పెసిఫికేష‌న్స్‌ చూస్తే షాక్..

Nokia Earphones: ప్ర‌ఖ్యాత స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ నోకియా త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటూ పోతోంది. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల‌తోపాటు స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమ‌ర్స్‌, ఏసీలు, లాప్‌టాప్‌ల‌ను విడుదల

Nokia Earphones: నోకియా ప్రొఫెషనల్ 'ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్' విడుద‌ల‌.. స్పెసిఫికేష‌న్స్‌ చూస్తే షాక్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 04, 2021 | 4:36 PM

Nokia Earphones: ప్ర‌ఖ్యాత స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ నోకియా త‌న ప‌రిధిని విస్త‌రించుకుంటూ పోతోంది. ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల‌తోపాటు స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమ‌ర్స్‌, ఏసీలు, లాప్‌టాప్‌ల‌ను విడుదల చేయ‌గా తాజాగా ప్రొఫెషనల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ను ఆవిష్క‌రించింది. నోకియా పి3600 పేరుతో నోకియా ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌ఫోన్‌లను ఎలాంటి ప్ర‌చార ఆర్భాటాలు లేకుండా నోకియా తన వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శించింది. నోకియా ప్రొఫెషనల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ పి 3600 ఒకే రంగులో అందుబాటులో ఉంది. ఈ ఇయ‌ర్‌ఫోన్స్‌కు సుమారు 6గంట‌ల బ్యాట‌రీ లైఫ్ ఉంటుంది. ఛార్జింగ్ కేసుతో 24 గంటల వరకు పొడిగించవ‌చ్చు. టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లు ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్‌కు స‌పోర్ట్ ఇస్తాయి. నోకియా ప్రొఫెషనల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ పి 3600 ధర ఇంకా వెల్ల‌డి కాలేదు. త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామంటూ నోకియా త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది.

నోకియా ప్రొఫెషనల్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ పి 3600 ఇయర్‌ఫోన్‌లు 8 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో బాలెన్స్‌డ్ ఆర్మేచర్‌తో డ్యూయల్ డ్రైవర్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి 20Hz నుంచి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంటాయి అలాగే బ్లూటూత్ 5.2 మద్దతుతో వస్తాయి. ఇది HSP, HFP, AVRCP మరియు A2DP ప్రొఫైల్‌లకు మద్దతు ఇస్తుంది. ఆడియో ఫార్మాట్లలో SBC మరియు AptX అడాప్టివ్ ఉన్నాయి. రెండు ఇయర్‌బడ్స్‌లో ఒక్కొక్కటి 45 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ కేసులో 400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. పి 3600 ఇయర్‌ఫోన్‌లు ఒకే ఛార్జీపై ఆరు గంటలు, ఛార్జింగ్ కేసుతో 24 గంటల వరకు ఉండవచ్చని నోకియా తెలిపింది. సంస్థ ప్రకారం, టిడబ్ల్యుఎస్ ఇయర్‌ఫోన్‌లను సుమారు రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఇవి ఐపిఎక్స్ 4 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తాయి మరియు ప్రతి ఇయర్‌బడ్ బరువు 4.6 గ్రాములు. ఛార్జింగ్ కేసు బరువు 63 గ్రాములు ఉంటుంది.

సరికొత్త వేరియేషన్‌లో వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. తొలిసారిగా మర్కెట్‌లోకి విడుదల చేసిన యాపిల్ కంపెనీ..