UPI Payments: పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ

|

Jul 08, 2024 | 4:54 PM

మన దేశంలో మారుమూల గ్రామాలకు సైతం చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ).. ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో కూడా వినియోగం లోకి వస్తోంది. ఇది ఇక్కడ నుంచి ఆయా దేశాలకు వెళ్తున్న టూరిస్టులకు బాగా ఉపకరిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ అయిన పారిస్ లో యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పారిస్ లోని రెండు లోకేషన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

UPI Payments: పారిస్‌ వెళ్లే టూరిస్టులకు శుభవార్త.. నగదు బదిలీ ఇక చాలా ఈజీ
Upi Payments At Eiffel Tower
Follow us on

మన దేశంలో మారుమూల గ్రామాలకు సైతం చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ).. ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో కూడా వినియోగం లోకి వస్తోంది. ఇది ఇక్కడ నుంచి ఆయా దేశాలకు వెళ్తున్న టూరిస్టులకు బాగా ఉపకరిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ స్పాట్ అయిన పారిస్ లో యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పారిస్ లోని రెండు లోకేషన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. గతంలోనే ఈఫిల్ టవర్ వద్ద ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కోసం యూపీఐని విజయవంతంగా అమలు చేయగా.. ఇప్పుడు మరో చోట దీనిని వినియోగంలోకి తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి చెందిన అంతర్జాతీయ వింగ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) హౌస్‌మన్‌లోని గేలరీస్ లాఫయెట్ ఫ్లాగ్‌షిప్‌ స్టోర్లో యూపీఐ సేవలను ప్రారంభించింది. ఇ-కామర్స్, సామీప్య చెల్లింపులను సురక్షితం చేయడంలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ లైరా సహకారంతో ఇది పనిచేస్తుంది. ఇది ప్రధానంగా జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ కి గణనీయమైన సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎన్ఫీసీఐ ప్రకారం ఈ భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పారిస్‌ని సందర్శించే అనేక మంది భారతీయ పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

భారతీయ పర్యాటకులకు ప్రయోజనం..

ఫ్రాన్స్, మొనాకోలోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ ప్రకారం, ఇది ఫ్రాన్స్‌లో యూపీఐని విస్తృతంగా స్వీకరించడానికి, డిజిటల్ చెల్లింపు పద్ధతిగా ప్రపంచ విస్తరణకు సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. పారిస్‌లోని గ్యాలరీస్ లఫాయెట్‌తో తమ సహకారం ప్రతిష్టాత్మక వేదిక వద్ద యూపీఐ చెల్లింపులను ప్రారంభించడమే కాకుండా భారతీయ పర్యాటకులకు అనుకూలమైన, సురక్షితమైన క్రాస్-బోర్డర్ చెల్లింపు పద్ధతిగా యూపీఐ స్వీకరణను ప్రోత్సహిస్తుందని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా చెప్పారు. లైరా ఇండియా ఛైర్మన్ క్రిస్టోఫ్ మారియెట్ మాట్లాడుతూ ప్యారిస్‌లోని ఐకానిక్ డిపార్ట్‌మెంట్ స్టోర్స్ గ్యాలరీస్ లఫాయెట్ హౌస్‌మాన్‌లో యూపీఐ మోడ్ పేమెంట్లను ఆమోదించడం శుభపరిణామం అన్నారు. యూరప్‌లో ఇక్కడే మొదటిసారి యూపీఐ ప్రారంభించామన్నారు.

అంతకంతకూ పెరుగుతున్న లావాదేవీలు..

జూన్ 2024లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు 13.89 బిలియన్‌లకు చేరుకున్నాయి. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 49 శాతం పెరుగుదలను చూపుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా జూన్‌లో లావాదేవీ పరిమాణం రూ. 20.07 లక్షల కోట్లుగా ఉంది. ఇది మేలో కనిపించిన రూ. 20.45 లక్షల కోట్ల కంటే 1.9 శాతం తక్కువ. అయితే, ఏడాది ప్రాతిపదికన, లావాదేవీ పరిమాణం 36 శాతం పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..