China Smart Phones: చైనా ఫోన్ లను మనం విచ్చల విడిగా కొంటాం.. కానీ, అక్కడ మాత్రం వేరే ఫోన్ కొంటారు.. ఏమిటో తెలుసా?

|

Nov 30, 2021 | 9:55 PM

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనేది మన సామెత. అది సరిగ్గా చైనీయుల విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే, చైనాలో తయారయిన స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచం మరీ ముఖ్యంగా మన దేశం విపరీతంగా ఉపయోగిస్తుంది.

China Smart Phones: చైనా ఫోన్ లను మనం విచ్చల విడిగా కొంటాం.. కానీ, అక్కడ మాత్రం వేరే ఫోన్ కొంటారు.. ఏమిటో తెలుసా?
China Phones
Follow us on

China Smart Phones: పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనేది మన సామెత. అది సరిగ్గా చైనీయుల విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే, చైనాలో తయారయిన స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచం మరీ ముఖ్యంగా మన దేశం విపరీతంగా ఉపయోగిస్తుంది. కానీ, చైనీయులు మాత్రం తమ దేశంలో తయారయిన స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడానికి పెద్దగా ఇష్టపడరు. చైనా కంపెనీలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. జియోమీ, ఒప్పో, రియల్ మీ, వివో (Xiaomi, Oppo, Realme,Vivo) భారతదేశంలోని టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఉన్నాయి. ఈ బ్రాండ్‌లు ఏ దేశానికి చెందినవో ఆ దేశ ప్రజలు ఈ ఫోన్‌లను కొనడానికి ఇష్టపడడం లేదని మీకు తెలుసా. వాటి స్థానంలో చైనీయులు యాపిల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వారికి ఐఫోన్-13 సిరీస్ అంటే పిచ్చి.

యాపిల్ చైనా నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది

గత అక్టోబర్ నివేదిక ప్రకారం, ఆపిల్ చైనా టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఒప్పోను వదిలివేసింది. ఆపిల్ ఐఫోన్ చైనాలో ఎక్కువగా ఇష్టపడతారు. అక్టోబర్‌లో ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు గత నెలతో పోలిస్తే 46% వృద్ధిని సాధించాయని రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తన నివేదికలో పేర్కొంది. చైనా టాప్ టెక్ కంపెనీలు హవాయి, వివో, ఒప్పో(Huawei, Vivo, Oppo) టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించలేకపోయాయి.

ఈ ఏడాది మార్చిలో, ఆపిల్, వీవో తర్వాత ఒప్పో చైనా అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించింది. అంతకుముందు మార్చి 2021లో, వీవో అగ్రస్థానంలో ఉంది. అక్టోబర్‌లో, ఆపిల్ ఈ కంపెనీలన్నింటినీ అధిగమించి చైనా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించింది. డిసెంబర్ 2015 తర్వాత ఆపిల్ చైనాలో టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించడం ఇదే తొలిసారి. నివేదిక ప్రకారం, హావాయి కొంతకాలంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుండి దూరంగా ఉంది. హువాయి(Huawei) మార్కెట్ వాటా గత 5 నుండి 6 నెలల్లో బలమైన క్షీణతను చూసింది. దీని ద్వారా యాపిల్‌ నేరుగా లబ్ధి పొందింది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బ్రాండ్‌లు జూలై, సెప్టెంబర్ మధ్య అంటే మూడవ త్రైమాసికంలో (3Q21) ఏమిటో తెలుసా? జియోమీ(Xiaomi) భారతదేశంలో గరిష్ట సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. 2021 మూడవ త్రైమాసికంలో 12 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ విక్రయాలతో జియోమీ(Xiaomi) ముందుంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) నివేదిక ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2021 మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 12% క్షీణతను నమోదు చేసింది. ఈ సమయంలో, భారతదేశంలో 48 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు జరిగాయి.

రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని చైనా కంపెనీలకు శాంసంగ్ మాత్రమే పోటీ ఇస్తోంది.

2020లో భారతదేశంలో 5.42 కోట్ల ఫోన్‌లు అమ్ముడయ్యాయి. వివో అప్పుడు ముందుంది. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 12% తగ్గడం ఇదే తొలిసారి. కాగా దీనికి ముందు వరుసగా గత 4 త్రైమాసికాల్లో మాత్రమే వృద్ధి నమోదైంది. లాక్‌డౌన్‌లో చిప్స్‌ లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..