Stock Market: రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు ప్రకటన తరువాత వరుసగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు తేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు వార్త కారణంగా సుమారు రూ.8 లక్షలకు పైగా మదుపరుల సంపద ఆవిరైంది. ఈ రోజు ఉదయం 9.20 గంటలకు స్వల్ప లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ-50 కేవలం 31 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 117 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 132 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగానే కొనసాగుతుండటంతో భారత కరెన్సీ రూపాయి విలువ భారీగా పతనమైంది. ఆధార్ హౌసింగ్ సంస్థ ఐపీవోకు 15 నెలల తరువాత సెబీ అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో రెయింహో చిల్డ్రన్స్ మెడికేర్ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.
నిఫ్టీ సూచీలోని ఏషియన్ పెయింట్స్ 2.43%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.98%, హిందుస్థాన్ యూనిలివర్ 1.93%, మారుతీ సుజుకీ 1.47%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1.43%, జీ ఎంటర్టెయిన్ మెంట్ 1.34%, లుపిన్ 1.22%, హిందుస్థాన్ పెట్రోలియం 1.19%, ఐచర్ మోటార్స్ 1.16%, యూపీఎల్ 1.11% మేర పెరిగి ఆరంభంలో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ 2.58%, హిందాల్కో 1.63%, ఇన్ఫోసిస్ 1.04%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.77%, టాటా స్టీల్ 0.71%, సిప్లా 0.66%, కోల్ ఇండియా 0.46%, ఐసీఐసీఐ బ్యాంక్ 0.39%, వేదాంతా 0.33%, విప్రో 0.22% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు భారీ స్పందన.. అప్లై చేసిన వారందరికీ షేర్లు వస్తాయా.. పూర్తి వివరాలు..