Indian Markets: వరుస నష్టాలతో కొట్టుమిట్టాడిన భారత స్టాక్ మార్కెట్ల గమనం మారినట్లు కనిపిస్తోంది. మదుపరుల సెంటిమెంట్లు మారినట్లు కనిపిస్తోంది. ఉదయం సూచీలు లాభాలతో మెుదలయ్యాయి. సెన్సెక్స్ సూచీ 400 పాయింట్లకు పైగా పెరిగి ట్రేడింగ్ జరుగుతుండగా.. మరో సూచీ నిఫ్టీ-50 100 పాయింట్లకు పైగా పెరిగి ట్రేడ్ అవుతోంది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 250 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలు ఈనెల 27 నుంచి సాధారణంగా తిరిగేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ రంగంలోని షేర్లు ఫోకస్ లో ఉన్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ కారణాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మాత్రం తీవ్ర ఒత్తిడి మధ్య ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ సూచీ 15671 పాయింట్ల మార్క్ సపోర్ట్ ను కోల్పోతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిని చూడవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్లో సన్ ఫార్మా 2.83%, టెక్ మహీంద్రా 2.76%, ఆదానీ పోర్ట్స్ 2.32%, రిలయన్స్ 2.30%, డాక్టర్ రెడ్డీస్ 1.98% శాతం లాభాలతో టాప్ గెయినర్స్ గా నిలవగా.. శ్రీ సిమెంట్ 2.13%, ఏషియన్ పెయింట్స్ 1.76%, పవర్ గ్రిడ్ 1.72%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.40%, యాక్సిస్ బ్యాంక్ 1.01% కంపెనీలు నష్టాల్లో నేడు టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ప్రస్తుతం మార్కెట్లను గమనిస్తున్న నిపుణులు మెల్ల మెల్లగా మార్కెట్లు నష్టాల నుంచి బయటకు వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలిక మదుపరులు సైతం మార్కెట్ల జోరుతో స్థిమితపడుతున్నారు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రధానంగా మార్కెట్లకు ఊతం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదువండి..
IPO Alert: మార్కెట్లోకి మరో కొత్త ఐపీఓ.. రూ. 600 కోట్లు అందుకోసమేనా..?
Multibagger Penny Stocks: ఒక్క నెలలోనే అన్ని లాభాలా.. ఆ 3 కంపెనీలు సూపర్..