Stock Market Crash: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు!

|

Dec 19, 2024 | 6:42 PM

Stock Market Crash: ఈ రోజు స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో నమోదు అయ్యాయి. స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలడంతో రూ.3 లక్షల కోట్ల మేర నష్టపోయారు ఇన్వెస్టర్లు. భారీపతనంలో స్టాక్‌ మార్కెట్‌ ముగిసింది. గురువారం బీఎస్‌ఈలో 4,095 స్టాక్‌లు ట్రేడయ్యాయి. ఇందులో మొత్తం 1,684 స్టాక్స్ గ్రీన్‌లో ముగిశాయి..

Stock Market Crash: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు!
Follow us on

స్టాక్ మార్కెట్ మరోసారి కుప్పకూలింది. సెన్సెక్స్ 1.20 శాతం పతనంతో ముగిసింది. బుధవారం సెన్సెక్స్ 80,182.20 వద్ద ముగిసింది. ఇది రోజు కనిష్ట స్థాయి 79,020.08కి చేరుకుంది. నిఫ్టీ కూడా 329 పాయింట్లు పతనమై 23,870.30 వద్దకు చేరుకుంది. మార్కెట్ కొంత నష్టాలను కోలుకుని చివరకు సెన్సెక్స్ 964 పాయింట్లు పతనమై 79,218.05 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 247 పాయింట్లు పతనమై 23,951.70 వద్ద ముగిసింది.

మూడు కంపెనీలు మాత్రమే..

ఎన్‌ఎస్‌సీలో 14 గ్రీన్‌లో ముగియగా, మిగిలిన 27 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 2.50 శాతం పతనంతో టాప్ లూజర్ స్టాక్‌గా నిలిచింది. పెద్ద స్టాక్‌ల కంటే చిన్న, మధ్య-క్యాప్ స్టాక్‌లు మెరుగ్గా పనిచేశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం క్షీణించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం క్షీణించింది.

గురువారం బీఎస్‌ఈలో 4,095 స్టాక్‌లు ట్రేడయ్యాయి. ఇందులో మొత్తం 1,684 స్టాక్స్ గ్రీన్‌లో ముగిశాయి. 2,311 స్టాక్స్ భారీ పతనంతో ముగిశాయి. ఒక సంవత్సరంలో 221 కంపెనీల షేర్లు తమ టాప్ లెవల్‌కు చేరుకున్నాయి. 56 స్టాక్‌లు ఏడాది కనిష్ట స్థాయిలోనే ఉన్నాయి. 333 కంపెనీల స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌లో ముగిశాయి. కాగా, లోయర్ సర్క్యూట్‌లో 225 మూతపడ్డాయి.

మార్కెట్ పతనానికి అనేక కారణాలు:

BSEలో జాబితా చేయబడిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.452.6 లక్షల కోట్ల నుండి రూ.450 లక్షల కోట్లకు తగ్గింది. దీని కారణంగా పెట్టుబడిదారులు ఒక రోజులో సుమారు రూ. 3 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. గత నాలుగు రోజుల్లో పెట్టుబడిదారులు రూ. 9 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఐటీ, ఫార్మ అమ్మకాల ఒత్తిడి, అమెరికా ఫెడ్‌రేట్‌ తక్కువ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో సూచిలు కూడా నష్టాల బాట పట్టాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి