
ప్రయాణికులకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. ప్రయాణికుల కోసం రైల్వేశాఖ అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంది. మెరుగైన సేవలతో పాటు ప్రయోజనం చేకూర్చే అనేక నిర్ణయాలకు శ్రీకారం చుడుతోంది. ప్రయాణికులు పడుతున్న సమస్యలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టికెట్, బోర్డింగ్ రూల్స్ వంటి వాటిల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో ఇటీవల మార్పులు చేయగా.. తాజాగా బోర్డింగ్ రూల్స్ మార్చింది. ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.
ఇప్పటివరకు ట్రైన్ బయల్దేరడానికి కొన్ని గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశముంది. కానీ ఇప్పుడు ట్రైన్ బయల్దేరే 30 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ రైల్వే స్టేషన్ మార్చుకోవచ్చు. ఈ మేరకు కొత్త సదుపాయాన్ని ఐఆర్‌సీటీసీ తీసుకొచ్చింది. ట్రాఫిక్, చివరి నిమిషాల్లో ఏదైనా కారణాల వల్ల ట్రైన్ ఆలస్యమైన సమయంలో ట్రైన్ ఎక్కాల్సిన స్టేషన్ మార్చుకోవచ్చు. ఐఆర్‌సీటీలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఇది అమల్లో ఉంటుంది. అయితే ఒక్కసారి బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్న తర్వాత ఆ స్టేషన్‌కి వెళ్లి ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. లేకపోతే మీ టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.
కొంతమంది చివరి నిమిషంలో ట్రైన్ మిస్ అవుతున్నారు. బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే సదుపాయం వల్ల ట్రైన్ మిస్ అవ్వడం లాంటివి కాస్త తగ్గనున్నాయి. గతంలో 24 గంటల ముందు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి 30 నిమిషాలకు తగ్గించారు. మీరు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, యాప్ లేదా స్టేషన్లలోని కౌంటర్ల వద్ద బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. చివరి నిమిషంలో ప్రయాణాలను సులభతరం చేయడంలో రైల్వేశాఖ తీసుకున్న ఈ కొత్తనిర్ణయం ఉపయోగపడనుంది. కన్పార్మ్‌డ్ లేదా ఆర్‌ఏసీ టికెట్ ఉన్నప్పుడు మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ మార్చుకుంటే తొలి చార్ట్‌లో పేరు కనిపించదు. ట్రైన్ బయల్దేరడానికి ముందు రూపొందిచందే సెకండ్ ఛార్ట్‌లో పేరు ఉంటుంది. ఒక టికెట్‌కు ఒకసారి మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. ఆర్‌సీటీసీ ఫ్లా్‌ట్‌ఫామ్‌లో మీ టికెట్ కింద చేంజ్ బోర్డింగ్ పాయింట్ అనే ఆప్షన్ల ఉంటాయి. దీనిని క్లిక్ చేస్తే సరిపోతుంది.