AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.! పూర్తిస్థాయి రైలు తయారు చేయడానికి ఇన్ని కోట్లా.?

భారతీయ రైల్వేలో పట్టాలపై పరుగులు తీసే ఎలక్ట్రిక్ ఇంజిన్ల శక్తి అపారం. సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీకి 25 నుండి 30 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఇవి వేల టన్నుల బరువును సునాయాసంగా లాగగలవు. టెక్నాలజీ పెరిగేకొద్దీ వీటి ధర కూడా పెరుగుతోంది. ఆ వివరాలు ఇలా..

ట్రైన్ ఇంజిన్ ధర తెలిస్తే షాక్ అవుతారు.! పూర్తిస్థాయి రైలు తయారు చేయడానికి ఇన్ని కోట్లా.?
Train
Ravi Kiran
|

Updated on: May 14, 2026 | 11:23 AM

Share

మన దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణించే భారతీయ రైల్వేల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఒక రైలు ఇంజిన్ ధర ఎంత ఉంటుంది? లేదా మనం కూర్చునే ఒక్కో కోచ్ తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది? అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తుతుంటాయి. ఈ ధరలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక రైలు ఇంజిన్ కొనే డబ్బుతో ఒక చిన్న ఊరినే దత్తత తీసుకోవచ్చు అంటే నమ్ముతారా? అవును, రైల్వే పరికరాల తయారీకి భారీగా ఖర్చవుతుంది.

సాధారణంగా ఒక రైలు ఇంజిన్(లోకోమోటివ్) ధర అనేది దాని సామర్థ్యం, టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ధర సుమారు 25 నుండి 30 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారతీయ రైల్వేలోనే అత్యంత శక్తివంతమైన లోకోమోటివ్ అయిన ‘WAG-12B’ ధర దాదాపు 35 కోట్ల రూపాయలు. ఇక డీజిల్ ఇంజిన్ల విషయానికి వస్తే, వీటి ధర 15 నుండి 20 కోట్లు ఉంటుంది, అయితే పర్యావరణ కారణాల వల్ల ప్రస్తుతం వీటి తయారీని రైల్వే శాఖ తగ్గించింది.

ఇక మనం ప్రయాణించే కోచ్‌ల విషయానికి వస్తే, ఎల్హెచ్‌బి(LHB) జనరల్ క్లాస్ కోచ్ ధర 1.5 నుండి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అదే స్లీపర్ క్లాస్ కోచ్ అయితే 2 నుండి 2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఏసీ కోచ్‌ల ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి; థర్డ్ ఏసీ కోచ్‌కు 2.8 నుండి 3 కోట్లు, సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఏసీ కోచ్ తయారీకి 3.2 నుండి 3.5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అంటే మనం ప్రయాణించే ఒక్క ఏసీ కోచ్ విలువ కొన్ని ఖరీదైన విల్లాల కంటే ఎక్కువే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న 16 కోచ్‌ల ‘వందే భారత్’ రైలు తయారీ ఖర్చు సుమారు 115 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి చూస్తే, ఒక పూర్తి స్థాయి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాల మీదకు రావాలంటే సగటున 85 నుండి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత భారీ వ్యయంతో తయారైన ఈ రైల్వే ఆస్తులను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

Follow Us