Indian Railways: రైల్వే సంచలన నిర్ణయం.. ఈ 13 ప్రధాన స్టేషన్‌లలో టికెట్ల జారీ నిలిపివేత.. కారణం ఏంటంటే..

Indian Railways: ఈ 13 ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలంలో రెండు రోజుల పాటు టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిషేధించనున్నారు..

Indian Railways: రైల్వే సంచలన నిర్ణయం.. ఈ 13 ప్రధాన స్టేషన్‌లలో టికెట్ల జారీ నిలిపివేత.. కారణం ఏంటంటే..

Updated on: Dec 04, 2025 | 9:23 PM

Indian Railways: మహారాష్ట్రలోని 13 ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాలను సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. ఈ స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలంలో రెండు రోజుల పాటు టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిషేధించనున్నారు. రైల్వేలు ఈ స్టేషన్ల జాబితాను విడుదల చేసి, ప్రయాణికులు ఇంటి నుండి బయలుదేరే ముందు వారి పేర్లను తనిఖీ చేసుకోవాలని కోరారు.

సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ డాక్టర్ స్వప్నిల్ నీలా ప్రకారం..ఈ టికెట్లు జారీ నిలిపివేత ప్రయాణించేందుకు కాదు. కేవలం ప్లాట్‌ఫామ్‌ టికెట్లు మాత్రమే. మహాపరినిర్మాణ దివస్ కారణంగా డిసెంబర్ 5 నుండి 7 వరకు 13 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు విక్రయించరు. రైళ్లలో ప్రయాణించే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా, హాయిగా ప్రయాణించవచ్చు.

ఇది కూడా చదవండి: Auto News: బెస్ట్‌ స్కూటర్‌.. దీనిలో ఫుల్‌ ట్యాంక్ చేస్తే రూ. 238 కి.మీ మైలేజీ!

డిసెంబర్ 5 నుండి 7 వరకు ముంబై డివిజన్‌లోని CSMT, దాదర్ స్టేషన్లు, డిసెంబర్ 5, 6 తేదీలలో భూసావల్ డివిజన్‌లోని భూసావల్, నాసిక్ రోడ్, మన్మాడ్, జల్గావ్, అకోలా, షెగావ్, బద్నేరా, మల్కాపూర్, చాలిస్గావ్, డిసెంబర్ 5, 6 తేదీలలో నాగ్‌పూర్ డివిజన్‌లోని నాగ్‌పూర్ స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు జారీ చేయలేరు. ప్రయాణికులు తమ బంధువులను స్టేషన్ వెలుపల దింపి తిరిగి రావాలని రైల్వేలు విజ్ఞప్తి చేశాయి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడానికి సిబ్బందిని నియమించారు.

వారికి మినహాయింపు ఉంటుంది:

ఈ పరిమితి ప్రకారం.. వృద్ధులు, సీనియర్ సిటిజన్లు, అనారోగ్య ప్రయాణికులు, పిల్లలు, నిరక్షరాస్యులైన ప్రయాణికులు లేదా ఒంటరిగా ప్రయాణించలేని మహిళలు, వారి వెంట ఉన్న వ్యక్తులకు ఆంక్షల నుండి మినహాయింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి:

Christmas Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. క్రిస్మస్‌కు భారీగా సెలవులు..!

Electric Car: భారతదేశంలోనే అత్యంత చౌకైన 5 సీట్ల ఎలక్ట్రిక్ కార్.. ధర ఎంతో తెలుసా?

Bharat Taxi: కొత్త భారత్ టాక్సీ యాప్.. ఓలా, ఉబర్‌లతో పోటీ.. ప్రత్యేకతలు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి