Indian Railways: తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? మరి రీఫండ్‌ వస్తుందా? రాదా?

Indian Railways: ఈ తత్కాల్‌ టికెట్లపై ఎలాంటి రాయితీ ఉండదు. తత్కాల్ టిక్కెట్లు రైలుకు వర్తించే దూర పరిమితిని బట్టి ఉంటుందని గుర్తించుకోండి. చార్టులు తయారుచేసే వరకు ఒకే తత్కాల్ బెర్త్ బుక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే తత్కాల్ పథకం కింద రైలు రి

Indian Railways: తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? మరి రీఫండ్‌ వస్తుందా? రాదా?

Updated on: Apr 14, 2025 | 4:45 PM

అత్యవసర పరిస్థితుల్లో రైలు ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి రైల్వే తత్కాల్ సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణీకులు రైల్వే తత్కాల్ టిక్కెట్ (tatkal ticket) సదుపాయాన్ని పొందవచ్చు. ప్రయాణానికి ఒక రోజు ముందు కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా కన్ఫర్మ్‌ టిక్కెట్లు వెంటనే అందుబాటులో ఉంటాయి. పండుగ సీజన్లు మొదలైన సమయాల్లో సీటును పొందడం కొన్నిసార్లు కష్టమవుతుంది. తత్కాల్ టికెట్ రద్దు అయితే డబ్బులు వాపసు వస్తాయా?అనే ప్రశ్న చాలా మంది ప్రయాణికుల మదిలో తలెత్తుతుంది. తత్కాల్ టికెట్ రద్దు చేస్తే, డబ్బు వాపసు ఇస్తారా ? లేదా అనేది తెలుసుకుందాం.

ఏసీ కోచ్‌లకు తత్కాల్ రైలు బుకింగ్ ఉదయం 10 గంటలకు, అదే నాన్‌ ఏసీ అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని భారతీయ రైల్వేలు స్పష్టం చేసింది. రైలు బయలుదేరే స్టేషన్ నుండి ప్రయాణ తేదీని మినహాయించి తత్కాల్ టికెట్ బుకింగ్ ఒక రోజు ముందుగానే ప్రారంభమవుతుంది.

ఈ తత్కాల్‌ టికెట్లపై ఎలాంటి రాయితీ ఉండదు. తత్కాల్ టిక్కెట్లు రైలుకు వర్తించే దూర పరిమితిని బట్టి ఉంటుందని గుర్తించుకోండి. చార్టులు తయారుచేసే వరకు ఒకే తత్కాల్ బెర్త్ బుక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే తత్కాల్ పథకం కింద రైలు రిజర్వేషన్ చార్టులను తయారుచేసే సమయం వరకు మాత్రమే అనుమతించబడుతుంది. తత్కాల్ పథకం కింద చేసిన బుకింగ్‌లలో పేరు మార్చుకునే సౌకర్యం అనుమతించరు. తత్కాల్ ఛార్జీలతో సహా పూర్తి ఛార్జీని చెల్లించిన అసాధారణ సందర్భాలలో తప్ప నకిలీ తత్కాల్ టిక్కెట్లు జారీ చేయరు.

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. కన్ఫర్మ్‌ అయిన తత్కాల్ టిక్కెట్ల రద్దుపై రీఫండ్‌ ఉండదు. అయితే ఏదైనా కారణంగా కోచ్ అటాచ్ చేయకపోవడం, రైలు రద్దు వంటి కొన్ని పరిస్థితులలో తత్కాల్ కింద బుక్ చేసుకుని కన్ఫర్మ్‌ అయిన టిక్కెట్ల రద్దుపై పూర్తి రీఫండ్‌ వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి