Indian Railways: మీ బైక్‌ను రైల్వే ద్వారా పార్శిల్‌ చేయాలనుకుంటున్నారా? ప్రాసెస్‌ ఏంటో తెలుసా?

Indian Railways: మీ బైక్‌ స్టేషన్‌కు చేరిన తర్వాత మీరు లేదా మీ తరఫున వచ్చేవారు పార్శిల్ రసీదు, అందుకు గుర్తింపు కార్డు చూపించి బైక్‌ను తీసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వివరాలు పూర్తిగా నిర్ధారించిన తర్వాతనే మీకు బైక్‌ను అందిస్తారని గుర్తించుకోండి..

Indian Railways: మీ బైక్‌ను రైల్వే ద్వారా పార్శిల్‌ చేయాలనుకుంటున్నారా? ప్రాసెస్‌ ఏంటో తెలుసా?

Updated on: Sep 14, 2025 | 8:08 PM

Indian Railways: మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బైక్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ చేయాలంటే ఎలాగో చాలా మందికి తెలియకపోవచ్చు. బైక్‌ను తీసుకెళ్లేందుకు వ్యక్తి లేకుంటే కేవలం ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపించాలనుకునే వారికి భారత రైల్వే రైల్వేస్‌ పార్శిల్‌ సర్వీస్‌ను అందిస్తోంది. ఎక్కడ నుంచి అయినా మీరు ఇతర ప్రాంతాలకు మీ బైక్‌ను ట్రాన్స్‌పోర్ట్‌ చేయాలంటే సురక్షితంగా పంపించవచ్చు. అందుకు కొంత ప్రాసెస్‌ ఉంటుంది. అదేలాగో తెలుసుకుంటే ఆ సమయంలో టెన్షన్‌ పడాల్సిన అవసరం ఉండదు. అది కూడా తక్కువ ధరల్లోనే పంపించవచ్చు. దీని కోసం కొన్ని ముఖ్యమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే ప్యాకింగ్ నియమాలను పాటించాలి.

ఇది కూడా చదవండి: Traffic Challan: ఇదేమి చిత్రంరా నాయనా..హెల్మెట్‌ లేదని కారు డ్రైవర్‌కు చలాన్‌..!

రైలులో బైక్ పంపడానికి అవసరమైన పత్రాలు:

  • RC (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్): ఇది బైక్ యాజమాన్యాన్ని నిర్ధారించే ముఖ్యమైన డాక్యుమెంట్‌.
  • ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు: బైక్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలి. గడువు ముగిసిన బీమా ఉంటే మీరు బైక్‌ను బుకింగ్‌ చేసేటప్పుడు ఇబ్బంది కావచ్చు.
  • చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్: ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా PAN కార్డ్ వంటి గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి.

మీరు బైక్‌ణు పార్శిల్‌ ద్వారా ట్రాన్స్‌పోర్టు చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత రైల్వే అధికారులు బైక్ బరువు, మోడల్, ఇతర వివరాలను నమోదు చేస్తారు. అనంతరం మీకు పార్శిల్ రసీదు అందజేస్తారు. ఈ రసీదు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గమ్యస్థాన స్టేషన్‌లో బైక్‌ను పొందడానికి మీరు దీనిని చూపించాల్సి ఉంటుంది. రసీదును సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. అలాగే బైక్‌ను పంపించేటప్పుడు సరైన ప్యాకింగ్‌ కూడా ముఖ్యమే. బైక్‌ను పంపేముందు దానిని సరిగా ప్యాక్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే బైక్‌ పంపించే క్రమంలో ఎలాంటి నష్టం జరుగకుండా కాపాడవచ్చు. ఈ ప్యాకింగ్‌ సదుపాయం రైల్వే స్టేషన్‌లలోనే అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Vehicle Colour: ఏ రాశి వారికి ఎలాంటి రంగు వాహనం మంచిదో తెలుసా..?

అయితే బైక్‌ ప్యాకింగ్‌కు సుమారు రూ. 300 నుండి రూ. 600 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో పరిస్థితులను బట్టి ఖర్చులో కాస్త తేడా ఉండవచ్చని గమనించండి. అదనపు ఖర్చు చేయకూడదనుకుంటే, మీరు స్వయంగా బైక్‌ను ప్యాక్ చేసుకోవచ్చు. అలాగే బైక్‌ను పార్శిల్‌కు ఇచ్చేటప్పుడు బైక్‌లో పెట్రోల్‌ ట్యాంక్‌ను ఖాళీగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే భద్రతా కారణాల వల్ల నియమాలు ఉంటాయని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Auto News: వాహనదారులకు ఇది కదా కావాల్సింది.. ఈ కారు మైలేజీ 40కి.మీ.. రానున్న ఐదు బెస్ట్‌ కార్లు ఇవే!

రైలులో బైక్‌ను పంపడానికి రెండు మార్గాలు ఉన్నాయి:

లగేజీగా బుక్ చేయడం: మీరు స్వయంగా అదే రైల్లో ప్రయాణిస్తుంటే బైక్‌ను లగేజీగా బుక్ చేసుకోవచ్చు. బైక్‌ను మీ రైలు లోని పార్శిల్ వ్యాన్‌లో ఉంచుతారు. ఒక వేళ మీరు బైక్‌తో ప్రయాణించకపోతే దానిని పార్శిల్‌గా బుక్ చేస్తారు. రైల్వే నిర్ణీత సమయంలో బైక్‌ను గమ్యస్థాన స్టేషన్‌కు చేరుస్తుంది.

మీరు బైక్‌ను పంపేటప్పుడు దూరాన్ని బట్టి అంటే కిలోమీటర్లను బట్టి ఖర్చులు ఆధారపడి ఉంటాయని గుర్తించుకోండి. అలాగే బైక్‌ బరువును కూడా పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా ఈ ఖర్చు రూ. 500 నుండి రూ. 1500 వరకు ఉండవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత మీకు పార్శిల్ రసీదు లేదా లగేజీ టికెట్ అందిస్తారు. ఇది బైక్‌ను తీసుకునే సమయంలో చూపించాలి. మీ బైక్‌ స్టేషన్‌కు చేరిన తర్వాత మీరు లేదా మీ తరఫున వచ్చేవారు పార్శిల్ రసీదు, అందుకు గుర్తింపు కార్డు చూపించి బైక్‌ను తీసుకోవచ్చు. రైల్వే సిబ్బంది వివరాలు పూర్తిగా నిర్ధారించిన తర్వాతనే మీకు బైక్‌ను అందిస్తారని గుర్తించుకోండి.

నష్టం జరిగితే ఫిర్యాదు చేయవచ్చు:

అలాగే ప్యాకింగ్‌ సమయంలో మీ బైక్‌కు ఎటువంటి నష్టం జరిగినా వెంటనే స్టేషన్‌ మాస్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి