Vande Bharat: వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..? అక్కడ ట్రైనింగ్ అయితేనే డ్యూటీలోకి..

దేశంలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా పిలుస్తున్న వందే భారత్ రైళ్లను నిర్వహించాలంటే అనుభవంతో పాటు నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. లోక్ పైలట్లతో పాటు ఇతర సిబ్బంది ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాల్సి ఉంటుంది. దీంతో వీరికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.

Vande Bharat: వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..? అక్కడ ట్రైనింగ్ అయితేనే డ్యూటీలోకి..
Vande Bharat

Updated on: Sep 26, 2026 | 7:26 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 79 వందే భారత్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. అంతేకాకుండా ఒక వందే భారత్ స్లీపర్ రైలు కూడా సర్వీసులు అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నిర్వహించాలంటే సమర్ధవంతమైన సిబ్బంది అవసరం. దీంతో వందే భారత్ రైలు నడిపే లోకో పైలట్ల నుంచి ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరం. ఆధునాతన వ్యవస్థలపై అవగాహనతో పాటు ఏవైనా సమస్యలు వస్తే వాటిని గుర్తించే నైపుణ్యం, వాటిని సరిదిద్దే సామర్థ్యం సిబ్బందికి అవసరం. దీంతో వందే భారత్ రైళ్లలో సేవలు అందించే సిబ్బందికి ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తారు. అనుభవం కలిగిన సిబ్బందిని ఎంపిక చేసివారికి కొన్ని రోజుల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం వందే భారత్ రైలు సర్వీసుల నిర్వహణకు వారిని ఉపయోగించుకుంటారు.

ఐఐటీ ఖరగ్ పూర్‌లో ట్రైనింగ్

వందే భారత్ రైళ్ల ఆపరేషనల్ సిబ్బందికి ఖరగ్ పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఉన్నతస్థాయి శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం జమాల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (IRIMEE)తో ఖరగ్‌పూర్ ఐఐటీ ఐదేళ్ల పాటు ఒప్పందం కుదర్చుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన సెంటర్ ఫర్ రైల్వే రీసెర్చ్ (CRR) సమన్వయంతో ఈ ఒప్పందం కుదరగా.. వందే భారత్ సిబ్బందికి ప్రత్యేక రెసిడెన్షియల్ శిక్షణను అందిస్తారు. అధునాతన ట్రాక్షన్, ప్రొపల్షన్ వ్యవస్థలు, విద్యుత్ భద్రత, రైలు నియంత్రణ, రోలింగ్ స్టాక్ డయాగ్నోస్టిక్స్, కండిషన్ మానిటరింగ్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి అంశాలపై ట్రైనింగ్ ఉంటుంది.

సిబ్బందికి అధునాతన శిక్షణ

రాబోయే రోజుల్లో తీసుకురానున్న వందే భారత్ రైళ్లను నిర్వహించాలంటే అదనపు సిబ్బంది అవసరం. ఇక వందే భారత్ సరుకు రవాణా రైలు కూడా టెస్టింగ్ దశలో ఉంది. ఈ వ్యవస్థను నడిపించాలంటే నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. త్వరలో 260 వందే భారత్ రైలు సెట్లను రైల్వేశాఖ కొనుగోలు చేసేందుకు సిద్దమవుతోంది. వందే భారత్ సెట్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మోటార్లతో అమర్చబడిన కోచ్‌లు ఉంటాయి. ప్రతి బోగీ మోటార్లు లేకుండానే తనతో పాటు మరో రెండు బోగీలకు శక్తిని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీంతో ఈ రైళ్లను నడిపే లోక్ పైలెట్లు, ఆపరేటర్లకు ఉన్నత స్థాయి శిక్షణ తప్పనిసరి. దీంతో సమర్ధంతమైన శిక్షణ అందించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌తో రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒప్పందం కుదర్చుకుంది. ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us