Indian Railways: ఇక రైళ్లలో ప్రయాణిస్తే.. విమానం తరహా సదుపాయాలు.. ప్రయాణీకులను పలకరించనున్న హోస్టెస్‌లు!

|

Dec 10, 2021 | 4:51 PM

భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి విమానాల మాదిరిగానే రైళ్లలో 'ట్రైన్ హోస్టెస్'లను త్వరలో ఏర్పాటు చేయనుంది.

Indian Railways: ఇక రైళ్లలో ప్రయాణిస్తే.. విమానం తరహా సదుపాయాలు.. ప్రయాణీకులను పలకరించనున్న హోస్టెస్‌లు!
Train Hostess
Follow us on

Indian Railways: భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి విమానాల మాదిరిగానే రైళ్లలో ‘ట్రైన్ హోస్టెస్’లను త్వరలో ఏర్పాటు చేయనుంది. TV9 భరతవర్ష్‌తో ప్రత్యేక సంభాషణలో, ఐఆర్సీటీసీ(IRCTC) సీనియర్ అధికారి మాట్లాడుతూ, త్వరలో తమ ప్రీమియం తరగతి రైళ్లలో రైలు హోస్టెస్ విధులను ప్రవేశపెట్టవచ్చని చెప్పారు. ప్రయాణీకుల సౌకర్యం, సేవ కోసం రైలు హోస్టెస్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. అయితే, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి సుదూర ప్రీమియం రైళ్లలో ఈ సేవలను ప్రారంభించే అవకాశం లేదని ఐఆర్సీటీసీ తెలిపింది.

మహిళలతో పాటు పురుష హోస్టెస్‌లు కూడా..

ప్రీమియం రైళ్లలో హోస్టెస్ నియామకం ప్రధాన లక్ష్యం ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించడమేనని, ప్రయాణీకులు ఎక్కడానికి, దిగడానికి అలాగే వారి సీట్లకు ఆహారం, పానీయాలను పంపిణీ చేయడానికి సహాయపడతారని ఐఆర్సీటీసీ(IRCTC) అధికారి తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, సేవ కోసం నియమించబడే హోస్టెస్‌లు కేవలం మహిళలే కాదని, మహిళా హోస్టెస్‌లతో పాటు పురుష హోస్టెస్‌లు కూడా ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకు సేవలందిస్తారని ఆ అధికారి వెల్లడించారు.

ఈ రైళ్లలో మాత్రమే ఆ సౌకర్యాలు..

రైలులోని ఒక కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ, ఒక పురుషుడిని రైలు హోస్టెస్‌గా నియమించే యోచనలో ఉన్నట్లు అధికారి తెలిపారు. తక్కువ వ్యవధిలో తక్కువ ప్రయాణం చేసే ప్రీమియం రైళ్లలో మాత్రమే ఈ సౌకర్యం ప్రవేశపెడతారు. 12 నుంచి 18 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేసే రైళ్లలో మాత్రమే రైలు హోస్టెస్‌లను నియమిస్తామని ఆయన చెప్పారు.

ఐఆర్సీటీసీ(IRCTC) ఈ పథకం చాలా చర్చనీయాంశంగా ఉందని అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన కొన్ని రైళ్లలో మంచి స్పందన కనిపిస్తోందన్నారు. ఇది కాకుండా, రైలులో మగ, ఆడ హోస్టెస్‌లను ఉంచడం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, విమానంలో లానే రైలు ప్రయాణీకులు కూడా కమ్యూనికేషన్ నుంచి రైలు ప్రయాణ వివరాల వరకు అన్ని సౌకర్యాలను పొందగలుగుతారు.

ఇవి కూడా చదవండి: Bipin Rawat: జనరల్ బిపిన్ రావత్‌ పేరుకు ముందు ఉండే ‘PVSM, UYSM’ గురించి మీకు తెలుసా?.. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..!

Judge – Magistrate: న్యాయమూర్తి, మేజిస్ట్రేట్.. లాయర్, అడ్వొకేట్.. తేడాలేంటో తెలుసా? అయితే, ఇప్పుడే తెలుసుకోండి..!