Indian Railways: రైలులో ప్రయాణికులు ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా..?

|

Dec 19, 2024 | 7:45 PM

Indian Railways: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భారతీయ రైల్వే ఒకటి. దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు సుదూర ప్రయాణానికి రైళ్లు మాత్రమే మార్గం. రోజూ రైలులో ప్రయాణిస్తున్నప్పటికీ, చాలా మందికి రైలు నియమాల గురించి తెలియదు. అలాగే రైళ్లలో లగేజీని తీసుకెళ్లేందుకు కూడా నిర్దిష్ట పరిమితి ఉంటుంది.

Indian Railways: రైలులో ప్రయాణికులు ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా..?
Follow us on

భారతదేశంలో ప్రతిరోజూ దాదాపు 2 నుండి 2.5 కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. అయితే రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో మీకు తెలుసా? ప్రయాణికుల సంఖ్య కంటే లగేజీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లగేజీ పరిమితిని రైల్వేశాఖ నిర్ణయిస్తుంది. కానీ, చాలా మంది ప్రయాణికులకు ఎంత పరిమితిలో లగేజీ తీసుకెళ్లవచ్చు అనే విషయం పెద్దగా తెలియదు. చాలా మంది నిబంధనలకు మించి లగేజీని తీసుకెళ్తారు.

ఇది కూడా చదవండి: YouTube Premium Plan: యూట్యూబ్ యూజర్లకు షాక్‌.. జనవరి నుంచి ప్రీమియం ప్లాన్ ధరలు పెంపు..!

పశ్చిమ రైల్వే నివేదిక ప్రకారం.. రైలులో ఒక వ్యక్తి ఎంత లగేజీని తీసుకెళ్లాలో వివరంగా తెలిపింది. గతంలో దీపావళి సందర్భంగా ఈ ఏడాది ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ రద్దీగా ఉండేది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో రైళ్లు, స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు పశ్చిమ రైల్వే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సౌత్ సహా ఇతర రైల్వే స్టేషన్లకు కూడా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

రైల్వే అధికారిక ఇంటర్వ్యూలో..

దీనిపై ఓ రైల్వే అధికారిని ఓ ఇంటర్వ్యూ ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ప్రయాణికులు చాలా లగేజీలతో స్టేషన్‌లకు వస్తున్నారని, దీంతో ఒక్కోసారి రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ఇబ్బందులు సర్వసాధారణం. ఇదంతా రైలులో లగేజీని అధికంగా ఎక్కించడమే కారణం. దీంతో రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా లగేజీపై దృష్టి సారిస్తున్నాం అని తెలిపారు.

రైలులో ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చు?

  • రైలులోని మొదటి ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే 70 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇంతకంటే ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణించాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి.
  • రైలులోని థర్డ్ ఏసీలో ప్రయాణిస్తే 40 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంటే సెకండ్ ఏసీలో ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు.
  • స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికుడు 40 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. మీరు ఇంతకంటే ఎక్కువ లగేజీతో ప్రయాణిస్తే, రైల్వే నిబంధనల ప్రకారం మీకు జరిమానా విధిస్తారు.
  • భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు రైలులో 40 నుండి 70 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇందులో ఏయే క్లాస్‌ బోగిల్లో ప్రయాణిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.

విమానాల్లో లగేజీ ఎలా ఉంటుంది?

సాధారణంగా ఎయిర్‌లైన్ బ్యాగేజీ పరిమితులు విమానయాన సంస్థను బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో తరచుగా ప్రయాణించేవారు, రూట్‌లు, ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎయిర్ ఇండియా కోసం ఎకానమీ క్లాస్ ప్రయాణికులు 15-25 కిలోల బరువున్న లగేజీని తీసుకెళ్లవచ్చు. బిజినెస్, ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 35 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చని గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి: Vehicle Number Plates: వాహనాల నెంబర్​ ప్లేట్స్‌కు ఇన్ని రంగులు ఎందుకో తెలుసా? వాటి అర్థం ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి