Indian Railways: భారతదేశపు అత్యంత చౌకైన ఏసీ రైలు.. కి.మీ కేవలం 68 పైసలే..!

|

Jan 10, 2025 | 2:50 PM

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా ఈ ఒక్క ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.

Indian Railways: భారతదేశపు అత్యంత చౌకైన ఏసీ రైలు.. కి.మీ కేవలం 68 పైసలే..!
Follow us on

భారతీయ రైల్వే రైళ్లలో టికెట్ ఛార్జీలు కోచ్, సౌకర్యాలను బట్టి మారుతూ ఉంటాయి. స్లీపర్, జనరల్ కోచ్‌లతో పోలిస్తే AC కోచ్‌ల ఛార్జీలు ఎక్కువ. AC కోచ్‌లో ఏసీ రైళ్ల ఛార్జీలు స్లీపర్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ప్రయాణికులు అందులో వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఆ రైలును ‘రాజధాని’ అని పిలుస్తారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, నమో భారత్, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లు భారతీయ రైల్వేలకు గర్వకారణం. ఈ రైళ్లలో ఏడాది పొడవునా టిక్కెట్లు ఫుల్‌గానే ఉంటాయి. డిమాండ్, సీట్ల లభ్యతను బట్టి రైళ్లలో డైనమిక్ ఛార్జీలు ఉంటాయి. అందువల్ల కొన్నిసార్లు ఈ రైళ్ల ఛార్జీలు విమాన టిక్కెట్‌తో సమానంగా ఉంటాయి. అయితే మీకు చెప్పబోయే రైలు దేశంలోనే అత్యంత చౌకైన రైలు. ఈ ఏసీ కోచ్ రైలు ఛార్జీ అతి తక్కువ ఉంటుంది. ఛార్జీలు తక్కువగా ఉన్నందున దాని వేగం తక్కువేమి ఉండదు. స్పీడ్‌ పరంగా ఈ రైలు వందే భారత్, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోటీ పడుతుంది.

రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి రైళ్ల మాదిరిగానే ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్. కానీ ఛార్జీల పరంగా ఈ రైళ్ల కంటే చాలా తక్కువ ధర. భారతదేశంలో ఖరీదైన రైళ్లకు కొరత లేదు. చాలా లగ్జరీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర తక్కువగా ఉన్న రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్‌తో ఉంటుంది. దేశంలోనే అత్యంత చౌకైన రైలుగా పేరుగాంచింది.

భారతదేశపు అత్యంత చౌకైన రైలు పేరు గరీబ్ రథ్. ఈ ఏసీ కోచ్ రైలు ధర కిలోమీటరుకు 68 పైసలు మాత్రమే. ఈ ఛార్జీతో మీరు ఏసీ కోచ్‌లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పూర్తిగా ఏసీ కోచ్‌లతో కూడిన ఈ రైలును పేదల రాజధాని ఎక్స్‌ప్రెస్ అంటారు. తక్కువ డబ్బుతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ఆనందాన్ని ప్రజలకు అందించేందుకు ఈ రైలును ప్రారంభించారు.

2006 సంవత్సరంలో ఈ రైలును బీహార్‌లోని సహర్సా నుండి అమృత్‌సర్‌కు మొదటిసారిగా నడిపారు. నేడు ఈ రైలు వివిధ నగరాల మధ్య 26 రూట్లలో నడుస్తుంది. ఇది ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-చెన్నై, పాట్నా-కోల్‌కతా వంటి ముఖ్యమైన మార్గాలలో నడుస్తుంది. ఈ రైలు ఏడాది పొడవునా రద్దీగా ఉంటుంది. క‌న్‌ఫ‌ర్మ్‌గా టిక్కెట్టు పొంద‌డం క‌ష్టం. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 160 కిమీ మాత్రమే అయినప్పటికీ, ప్రస్తుతం వందే భారత్ రైళ్ల సగటు వేగం గంటకు 66 నుండి 96 కిమీ వరకు ఉంది. గరీబ్ రథ్ రైలు సగటున గంటకు 70 నుండి 75 కి.మీ వేగంతో నడుస్తుంది.

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుండి ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడుస్తుంది. ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌. ఈ ట్రైన్‌ 2075 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు చెన్నై నుండి ఢిల్లీకి 28 గంటల 30 నిమిషాలలో దూరాన్ని చేరుకుంటుంది. ఈ రైలు ధర 1500 రూపాయలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి