
ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ బుకింగ్ యాప్ సేవలను భారతీయ రైల్వే నిలిపివేసింది. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా అన్‌రిజర్వుడ్, ఫ్లాట్‌ఫామ్ టికెట్లను ప్రయాణికులు ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉండేది. ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే ప్రయాణికులు ఈ యాప్‌ను ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు దీనిని రైల్వేశాఖ ఆపేసింది. మార్చి 1 నుంచి యూటీఎస్ యాప్ సేవలను బంద్ చేస్తున్నామని, ప్రయాణికులు ఇక నుంచి రైల్ వన్ యాప్‌ను ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ ప్రకటించింది. ఇక నుంచి రైల్వే టికెట్ల బుకింగ్, ఇతర సేవలన్నీ ఒకే యాప్‌లో అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ యూటీఎస్ యాప్‌ను డిస్‌కనెక్ట్ చేసింది. ఇక నుంచి రైల్వేశాఖకు సంబంధించిన అన్నీ సేవలు రైల్ వన్ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
-అన్ని రైళ్లకు టికెట్లు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు
-అన్‌రిజర్వుడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు
-ఫ్లాట్‌ఫామ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు
-మీరు ప్రయాణించే ట్రైన్ లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు
-ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు
-రైల్వే సేవలపై ఫిర్యాదు చేయవచ్చు
-అన్ రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకోవడం 3 శాతం డిస్కౌంట్
“UTS మొబైల్ యాప్ విలువైన కస్టమర్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. మీ UTS యాప్ సేవలు ఇప్పుడు అన్ని కొత్త రైల్ వన్ యాప్‌లకు బదిలీ చేయబడ్డాయి. మార్చి 1 నుండి UTS యాప్ నిలిపివేయబడుతుంది. సేవలను ఉపయోగించడం కొనసాగించడానికి దయచేసి ఈరోజే రైల్ వన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి” అంటూ రైల్వేశాఖ ప్రకటన విడుదల చేసింది.
Starting March 1st, the UTS app will be discontinued. Say hello to RailOne – your new All-in-one app for unreserved, reserved and platform tickets 🚉@RailMinIndia @AshwiniVaishnaw#IndianRailways #railone #SouthCentralRailway #DigitalIndia #TravelUpdate pic.twitter.com/YIwuFct7Zv
— South Central Railway (@SCRailwayIndia) February 28, 2026
అయితే యూటీఎస్ యాప్‌లో ఆర్ వ్యాలెట్‌లో నగదు ఉంటే.. ఆ నగుదు గురించి యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ డబ్బులు ఆటోమేటిక్‌గా రైల్ వన్ యాప్‌కు బదిలీ అవుతాయి. మీరు యూటీఎస్ యాప్‌ను ఏ నెంబర్‌తో లాగిన్ అయ్యారో.. అదే నెంబర్‌తో రైల్ వన్ యాప్‌లో లాగిన్ అయ్యితే ఆర్ వ్యాలెట్ డబ్బులు బదిలీ అవుతాయి. ఏమైనా ఇబ్బందులు ఉంటే.. https://railone.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో సహాయం, మద్దతు విభాగాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ స్పష్టం చేసింది. యూటీఎస్ వినియోగదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అటు ఇక నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలంటే రైల్ వన్ యాప్‌ను వాడాలని, ఇతర రైల్వే సేవలన్నీ ఒకేచోట పొందవచ్చని రైల్వేశాఖ తెలిపింది. ప్రయాణికులందరూ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలని సూచించింది.