Post Office: మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్‌ తీయాలనుకుంటున్నారా..? ఈ నిబంధనలు తప్పనిసరి..!

|

Jan 28, 2022 | 5:18 AM

Post Office: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరవాలని భావిస్తున్నారా..? ముందుగా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. ఇకపోస్టాఫీసు కస్టమర్లు..

Post Office: మీరు పోస్ట్ ఆఫీసులో అకౌంట్‌ తీయాలనుకుంటున్నారా..? ఈ నిబంధనలు తప్పనిసరి..!
Follow us on

Post Office: మీరు పోస్టాఫీసులో ఖాతా తెరవాలని భావిస్తున్నారా..? ముందుగా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. ఇకపోస్టాఫీసు కస్టమర్లు అకౌంట్‌ కావాలంటే పాన్‌ కార్డు ఉండటం తప్పనిసరి. అకౌంట్‌తో పాన్‌ కార్డును తప్పకుండా లింక్‌ చేసుకోవాలి. ఒక వేళ ఇలా చేయని పక్షంలో అకౌంట్‌ ఉన్నా.. నిలిపివేస్తారు. పాన్‌ కార్డు నెంబర్‌ లేదంటే ఫామ్‌ 60 లేకపోతో ఖాతా ఓపెనింగ్‌ సేవలు పొందలేరని పోస్టల్‌ శాఖ తెలిపింది. అయితే వినియోగదారుడు సమర్పించిన పాన్‌ నెంబర్‌ సరైనదోకాదో అని ఎన్‌ఎస్‌డీఎల్‌తో ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేస్తామని తెలిపింది.

పాన్‌ నెంబర్‌ తప్పుగా ఉంటే..

ఒక వేళ మీరు సమర్పించే పాన్‌ నెంబర్‌ తప్పుగా ఉన్నట్లయితే టీడీఎస్‌ రిటర్న్‌తో ఇబ్బందులు ఎదురవుతాయని డిపార్ట్‌మెంట్‌ పోస్ట్‌ వెల్లడించింది. అయితే పాన్‌కార్డు నెంబర్‌ తప్పుగా ఉండటం కారణంగా టీడీఎస్‌ రిటర్న్‌లు దాఖలు సమయంలో ఆదాయపు పన్నుస్టేట్‌ మెంట్‌లలో చాలా పాన్ నెంబర్లను అంగీకరించడం లేదని, దీని వల్ల డిపాజిట్ దారుల నుంచి ఫిర్యాదులు పెరుగుతున్నాయని పోస్టల్‌ శాఖ తెలిపింది.

సేవింగ్స్‌ ప్రయోషన్‌ నిబంధనల ప్రకారం..

సేవింగ్స్‌ ప్రమోషన్‌ నిబంధనలు 2018లోని రూల్‌ 6 ప్రకారం.. పోస్టాఫీసుల్లో అకౌంట్‌ తీయాలంటే పాన్‌ నెంబర్‌ ఉండటం తప్పనిసరి. మీరు ఫామ్‌ 60 సమర్పించినట్లయితే ఆ తర్వాత కూడా పాన్‌ నెంబర్‌ తప్పనిసిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం ఆరు నెలల పాటు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా  చదవండి:

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? సమాచారం కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌..!

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు..!