Swiggy: స్విగ్గీ మరో భారీ డీల్.. Dineoutను చేజిక్కించుకోనున్న ఫుడ్ డెలివరీ దిగ్గజం..
Dineout: శుక్రవారం ఫుడ్ డెలివరీ దిగ్గజం Swiggy, ప్రముఖ డైనింగ్-అవుట్, రెస్టారెంట్ టెక్ ప్లాట్‌ఫారమ్ అయిన డైనౌట్‌ను కొనుగోలు చేయడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ కి సంబంధించిన ఆర్థిక అంశాలను ఈ స్టార్టప్‌లు బయటకు తెలపలేదు. కానీ..
Dineout: శుక్రవారం ఫుడ్ డెలివరీ దిగ్గజం Swiggy, ప్రముఖ డైనింగ్-అవుట్, రెస్టారెంట్ టెక్ ప్లాట్‌ఫారమ్ అయిన డైనౌట్‌ను కొనుగోలు చేయడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ కి సంబంధించిన ఆర్థిక అంశాలను ఈ స్టార్టప్‌లు బయటకు తెలపలేదు. కానీ.. డైన్‌అవుట్‌ని ఆల్-ఈక్విటీ డీల్‌లో 200 మిలియన్ డాలర్లకు స్విగ్గీ చేజిక్కించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టేబుల్ రిజర్వేషన్‌లు, ఈవెంట్‌లతో సహా డినౌట్ ఆఫర్‌లతో సినర్జీలను రెట్టింపు చేయాలని యోచిస్తున్నట్లు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ తెలిపింది. కొనుగోలు తర్వాత కూడా Dineout ఒక స్వతంత్ర యాప్‌గా పనిచేయడం కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ కొనుగోలు స్విగ్గీ కొత్త అనుభవాలను అందించడానికి వీలు కల్పిస్తుందని సంస్థ CEO శ్రీహర్ష మెజెటీని అన్నారు. డైన్‌అవుట్ విశ్వసనీయమైన కస్టమర్స్, రెస్టారెంట్స్ బేస్‌ని కలిగి ఉన్న “బాగా ఇష్టపడే బ్రాండ్” అని మెజెటీ అన్నారు.
డైనింగ్ అవుట్ టేబుల్ రిజర్వేషన్‌లు, ఈవెంట్‌ల సేవతో.. డైన్‌అవుట్ దేశమంతటా 50,000 కంటే ఎక్కువ రెస్టారెంట్ భాగస్వాములతో కూడిన నెట్‌వర్క్‌ను నిర్మించగలిగింది. ఇది రెస్టారెంట్‌లు, కస్టమర్‌లకు ఇయర్లీ మెంబర్షిప్ అమ్మకాలు, బిల్లింగ్ చెల్లింపుల పరిష్కారం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. దేశంలోని రెండు విభాగాల్లో పెరుగుతున్న పోటీ దృష్ట్యా ఫుడ్ డెలివరీ దిగ్గజం ఫుడ్, గ్రాసరీ డెలివరీలకు మించి తన ఆఫర్లను విస్తరించాలని చూస్తున్న తరుణంలో Swiggy డైన్‌అవుట్‌ను కొనుగోలు చేయడం గమనించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Cyber Crime: అద్దె ఇంటి కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారా.? ఇలాంటి కేటుగాళ్లు ఉన్నారు జాగ్రత్త..