Gowtham Adani: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బిలియనీర్లలో(Indian Billionaire) ఒకరు, రెండవ అత్యంత సంపన్నుడు, వ్యాపార చదురత కలిగిన వ్యక్తి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. కానీ ఆయన రెండు సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తెలుసా. ఈ 59 ఏళ్ల వ్యాపారవేత్త మెుదటి సారి ఒక కిడ్నాప్(Kidnap) నుంచి బయటపడగా.. రెండో సారి 2008 లో ముంబయి నగరంపై ఉగ్రవాదులు చేసిన సమయంలోనూ అదానీ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రస్తుతానికి భారతదేశంలో రెండవ అత్యంత సంపన్నుడుగా కొనసాగుతున్నారు. ముకేష్ అంబానీకి పోటీ ఇవ్వటంలో ఏమాత్రం తక్కువ కానీ అదానీ చాలా సార్లు తన ఆస్తుల మార్కెట్ విలువ పెరగటం వల్ల అంబానీని వెనుకకు నెట్టారు.
టీనేజర్ గా ఉన్నప్పుడు కిడ్నాప్..
1978లో గౌతమ్ అదానీ ముంబయి నగరానికి వచ్చారు. వజ్రాల వ్యాపాలంలో మహేంద్రా బ్రదర్స్ వద్ద పనిచేశారు. అక్కడ 2 నుంచి 3 సంవత్సరాలు పనిచేసిన తరువాత సొంతంగా ముంబయి జవేరీ బజారులో వ్యాపారం ప్రారంభించాడు. అక్కడ మంచి వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాక 1981లో అహ్మదాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ 1988లో అదానీ ఎక్స్ పోర్ట్స్ పేరుతో కమోడిటీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా వార్తా పత్రికలకు ఎక్కి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ ఆయనొక కాలేజ్ డ్రాప్ అవుట్. 1990 ల నుంచి చేసిన వ్యాపారాలు విజయవంతం అయ్యాయి. అప్పుడే 1997 లో గిట్టని వారు ఆయనను కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఆయన కుటుంబం నుంచి రూ. 11 కోట్ల ధనాన్ని వారు డిమాండ్ చేశారు. గన్ పాయింట్ రేంజ్ లో తుపాకి పెట్టి మరి అదానీని వారు కిడ్నాప్ చేసినట్లు పోలీసుల ఛార్జ్ షీట్ వివరాలు ప్రకారం తెలుస్తోంది.
2008 ముంబయి దాడుల నుంచి ప్రాణాలతో బయటకు..
పాకిస్థాన్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయి మహానగరంలో దాడులకు తెగబడ్డారు. విదేశీయులు, వ్యాపారవేత్తలు ఎక్కువగా వచ్చే తాజ్ హోటల్ పై వారు దాడులు చేశారు. ఆ సమయంలో గౌతమ్ అదానీ హోటల్లో డిన్నర్ తింటున్నారు. హోటల్ లోకి ప్రవేశించిన ముష్కరులు సుమారు 160 మంది అతిథులను చంపేశారు. ఆ సమయంలో అదానీ హోటల్ బేస్ మెంట్ లో దాక్కున్నారు. కమాండోలు చివరికి హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత దిగ్గజ వ్యాపారవేత్త ప్రాణాలతో బయటకు తప్పించుకోగలిగారు. ఆ సమయంలో హోటల్ లోని ఉద్యోగులు అతిథులను బేస్ మెంట్ కు తరలించారు. ఆ తరువాత కింద ఊపిరి ఆడని పరిస్థితి రావటంలో హోటల్ పై అంతస్తులోని తాజ్ ఛాంబర్ హాల్ కు వారిని తరలించారు. ఆ సమయంలో అయనను చివరికి హోటల్ వెనుక భాగంలోని ద్వారం నుంచి పోలీసులు కాపాడారు. కేవలం 15 అడుగుల దూరంలో మరణాన్ని చూశాడని అదానీ అప్పట్లో వెల్లడించారు.
ఇవీ చదవండి..
Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించలేక పోతే ఏం జరుగుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..?
Russia Ukraine War: యుద్ధంలో తెరపైకి జీవరసాయన ఆయుధాలు.. అసలు అవి ఎంత ప్రమాదకరమో తెలుసా