Rakesh Jhunjhunwala: ఒక్క రోజులోనే అమాంతం పెరిగిన బిగ్ బుల్ పెట్టుబడుల విలువ.. ఎంతమేరంటే..

|

Mar 21, 2022 | 12:13 PM

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లో సంపాదన(Stock Market) ఆర్జించటం మనం అనుకున్నంత సులువు కాదు. చాలా సార్లు సంపాదించేదానికంటే నష్టపోయే సొమ్ము ఎక్కువగా ఉంటుంది.

Rakesh Jhunjhunwala: ఒక్క రోజులోనే అమాంతం పెరిగిన బిగ్ బుల్ పెట్టుబడుల విలువ.. ఎంతమేరంటే..
Rakesh Jhunjhunwala
Follow us on

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్లో సంపాదన(Stock Market) ఆర్జించటం మనం అనుకున్నంత సులువు కాదు. చాలా సార్లు సంపాదించేదానికంటే నష్టపోయే సొమ్ము ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇండియన్ బిగ్ బుల్(Big Bull) రాకేశ్ జున్ జున్ వాలా​ విషయంలో ఇవి భిన్నంగా ఉంటాయి. ఆయన ఒక్కరోజులో కోల్పోయినా.. సంపాదించినా అతి మన ఊహకు అందని మెుత్తం అయి ఉంటుంది. తాజాగా.. ఒక్కరోజులో రూ.861 కోట్లు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చూపారు. ఈయన పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్‌ అయిన టైటాన్ కంపెనీ, స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్లు.. మార్చి 17 ట్రేడింగ్‌లో భారీగా పెరిగాయి. టైటాన్ షేర్లు మార్చి 17న రూ.2,587.30 నుంచి రూ.2,706కు పెరిగి.. ఒక్కో షేరు విలువ రూ.118.70కు పెరిగింది. అదేవిధంగా స్టార్ హెల్త్ షేరు ధర రూ.608.80 నుంచి రూ.641కు పెరిగి.. ఒక్కో షేరుకు రూ.32.20 ఎగబాకింది.

అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసికంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ రాకేశ్ జున్ జున్ వాలాకు, ఆయన భార్య రేఖా రాకేశ్ జున్ జున్ వాలాకు కలిపి కంపెనీలో వాటాలు ఉన్నాయి. రాకేశ్ జున్ జున్ వాలా 3,57,10,395 షేర్లతో కంపెనీలో 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖ సంస్థలో 95,40,575 షేర్లతో 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే వీరిద్దరూ కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లతో 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో బిగ్ బుల్ కు 17.50 శాతం వాటా ఉంది. ఆయనకు ఈ కంపెనీలో 10 కోట్లకు పైగా షేర్లు ఉన్నాయి. టైటాన్ కంపెనీలో ఉన్న షేర్ల వల్ల సుమారు రూ.537 కోట్లు పెరగగా.. స్టార్ హెల్త్ కంపెనీలోని వాటాల వల్ల సుమారు రూ. 324 కోట్లును కేవలం ఒక్కరోజులోనే ఆర్జించారు. ఈ రెండింటి విలువ కలుపుకుంటే ఏకంగా రూ.861 కోట్ల వరకు ఆయన సంపద పెరిగింది.

ఇవీ చదవండి..

Emergency Fund: ఎమర్జెన్సీ ఫండ్‌ మెయింటెన్ చేస్తున్నారా.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు..!

Investment: పెట్టుబడుల వివరాలు ఉద్యోగి HRకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది..? పూర్తి వివరాలు..