భారత్‌, యూఏఈ మధ్య కీలక వాణిజ్య చర్చలు..! ముఖ్యంగా ఆ రంగంపైనే ఫోకస్‌..

భారత్, యూఏఈ మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు CEPA జాయింట్ కమిటీ చర్చలు ముమ్మరమయ్యాయి. మార్కెట్ యాక్సెస్, డేటా షేరింగ్, గోల్డ్ TRQ పారదర్శకత, ఔషధ రంగంలో సహకారం వంటి కీలక అంశాల పై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.

భారత్‌, యూఏఈ మధ్య కీలక వాణిజ్య చర్చలు..! ముఖ్యంగా ఆ రంగంపైనే ఫోకస్‌..
India Uae Trade

Updated on: Nov 27, 2025 | 11:00 PM

భారత్‌, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి చర్చలు ముమ్మరం అయ్యాయి. మార్కెట్ యాక్సెస్‌ను పెంచడం, డేటా షేరింగ్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై రెండు దేశాలు వివరంగా చర్చించాయి. భారత్‌-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) జాయింట్ కమిటీ సమావేశంలో ఈ చర్చలు జరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. CEPA అనేది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లాగానే పరిగణిస్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో, వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డేటా మార్పిడి, బంగారు TRQపై చర్చ

CEPA అమలు తర్వాత సాధించిన పురోగతిని సమావేశం సమగ్రంగా సమీక్షించింది. మార్కెట్ యాక్సెస్, డేటా మార్పిడి, గోల్డ్ TRQ (టారిఫ్ రేట్ కోటా) కేటాయింపు, డంపింగ్ వ్యతిరేక విషయాలు, సేవలు, మూల నియమాలు, BIS లైసెన్సింగ్ వంటి కీలక అంశాలపై ఇరుపక్షాలు వివరంగా చర్చించాయి. గోల్డ్ TRQ కేటాయింపు ఇప్పుడు పారదర్శకంగా, పోటీతత్వ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా జరుగుతుందని, దీనివల్ల వాణిజ్యం మరింత బహిరంగంగా, పారదర్శకంగా ఉంటుందని భారత్‌ UAEకి తెలియజేసింది.

ఫార్మా రంగంపై ప్రత్యేక దృష్టి

ఈ సమావేశంలో ఔషధ రంగానికి కూడా ప్రత్యేక శ్రద్ధ లభించింది. మందులు, వైద్య ఉత్పత్తులకు సంబంధించిన నియంత్రణ సహకారాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. చర్చలలో భారతదేశ APEDA, UAE వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ మధ్య ఆరిజిన్ సర్టిఫికెట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, విధానాలను సరళీకృతం చేయడం, ఆహార భద్రత, సాంకేతిక ప్రమాణాలపై కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడం కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి