UPI Update: భారతదేశం – నేపాల్ ప్రజలకు సరిహద్దు చెల్లింపులను సులభతరం చేయడానికి రెండు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారతదేశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేపాల్ రాష్ట్ర బ్యాంక్ భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ఏకీకరణ కోసం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ద్వారా రెండు దేశాల పౌరులు యూపీఐ ద్వారా సరిహద్దు చెల్లింపులు చేసుకోనున్నారు.
ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పత్రికా ప్రకటన విడుదల చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), నేషనల్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (NPI) అనుసంధానం భారతదేశం – నేపాల్ మధ్య సరిహద్దు చెల్లింపులను సులభతరం చేస్తుందని, ఈ ఏకీకరణ కారణంగా రెండు దేశాల పౌరులు తక్షణమే లావాదేవీలు చేయవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
India, and Nepal sign terms of reference for interlinking of payment systems.#India #Nepal #RBI #UPI #NPI pic.twitter.com/UvBn5ORTLs
— IndiaTV English (@indiatv) February 16, 2024
యూపీఐ, నేపల్‌ల లింక్స్ ద్వారా భారతదేశం – నేపాల్ తమ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లను అనుసంధానిస్తున్నాయని, ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక కనెక్టివిటీని మరింతగా పెంచుతుందని, రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేపాల్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. యూపీఐ, నేపాల్‌లను ఇంటర్‌లింక్ చేయడానికి అవసరమైన సిస్టమ్‌లు ఉపయోగించనున్నారు. యూపీఐ, నేపాల్ అధికారిక అనుసంధానం తర్వాత సేవలు ప్రారంభం కానున్నాయి.
అంతకుముందు 12 ఫిబ్రవరి 2024న యూపీఐ సేవలు శ్రీలంక, మారిషస్‌లలో ప్రారంభం అయ్యాయి. ఇటీవలి కాలంలో ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ నెట్‌వర్క్‌లతో యూపీఐ లింక్ చేయబడి, క్రాస్ బోర్డర్ పేమెంట్‌లను సులభంగా, తక్కువ ఖర్చుతో సేవలు కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి