AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశంలో ఉంది? భారత్‌ ఖజానాలో ఎంత? ఎన్నో స్థానంలో ఉంది!

చాలా ఏళ్లుగా ఇంగ్లండ్‌లో ఉన్న బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్‌కు తీసుకురానుంది. బ్రిటన్‌లో నిల్వ ఉన్న 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకురావాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్ణయించింది. దేశంలో బంగారం నిల్వలు ఇంత పెద్ద స్థాయిలో పెరగడం 1991లో తొలిసారి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం.

Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశంలో ఉంది? భారత్‌ ఖజానాలో ఎంత? ఎన్నో స్థానంలో ఉంది!
Gold
Subhash Goud
|

Updated on: Jun 03, 2024 | 4:39 PM

Share

చాలా ఏళ్లుగా ఇంగ్లండ్‌లో ఉన్న బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్‌కు తీసుకురానుంది. బ్రిటన్‌లో నిల్వ ఉన్న 100 టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకురావాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్ణయించింది. దేశంలో బంగారం నిల్వలు ఇంత పెద్ద స్థాయిలో పెరగడం 1991లో తొలిసారి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. అయితే ఏప్రిల్ 26, 2024 నాటికి ఆర్బీఐ వద్ద 827.69 టన్నుల బంగారం ఉంది. అలాగే ఆర్‌బీఐ వద్ద ఉన్న దాదాపు 413.8 టన్నుల బంగారాన్ని విదేశాల్లో ఉంచారు. ఇప్పుడు ఈ బంగారాన్ని నెమ్మదిగా భారత్‌కు తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఒక్కోసారి దేశంలోని బంగారాన్ని విదేశాల్లో ఉంచినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు విదేశీ బంగారాన్ని భారత్‌కు తీసుకువస్తున్నారు. “టైమ్స్ ఆఫ్ ఇండియా”లో ఒక నివేదిక ప్రకారం, RBI అధికారులు బ్రిటన్ నుండి 100 టన్నుల బంగారాన్ని రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశానికి తీసుకురానున్నారు.

తొమ్మిదో స్థానంలో భారత్‌

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వద్ద దాదాపు 800 టన్నుల బంగారం ఉంది. ఇందులో 500 టన్నులు విదేశాల్లో ఉండగా, 300 టన్నులు భారత్‌లో ఉన్నాయి. ఇప్పుడు దేశంలోకి 100 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ తీసుకువస్తున్నందున దేశ, విదేశాల నుంచి ఈ సంఖ్య 50-50 శాతంగా ఉండనుంది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం అమెరికా వద్ద ఉంది. అమెరికా బంగారం నిల్వ దాదాపు 8133 టన్నులు. ప్రపంచంలో అత్యధిక స్వర్ణం సాధించిన జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ వద్ద 822 టన్నుల బంగారం ఉంది. ఆర్‌బీఐ నిరంతరం బంగారం కొనుగోలు చేస్తోంది. దీంతో జపాన్‌ను వదిలి భారత్‌ త్వరలో 8వ స్థానానికి చేరుకోనుంది. జపాన్ వద్ద ప్రస్తుతం 845 టన్నుల బంగారం ఉంది.

ఏ దేశంలో ఎంత బంగారం ఉంది?

  1. అమెరికా – 8,133.46 టన్నులు ($579,050.15 మిలియన్లు)
  2. జర్మనీ – 3,352.65 టన్నులు ($238,662.64 మిలియన్లు)
  3. ఇటలీ – 2,451.84 టన్నులు ($174,555.00 మిలియన్లు)
  4. ఫ్రాన్స్ – 2,436.88 టన్నులు ($173,492.11 మిలియన్లు)
  5. రష్యా – 2,332.74 టన్నులు ($166,076.25 మిలియన్లు)
  6. చైనా – 2,262.45 టన్నులు ($161,071.82 మిలియన్లు)
  7. స్విట్జర్లాండ్ – 1,040.00 టన్నులు ($69,495.46 మిలియన్లు)
  8. జపాన్ – 845.97 టన్నులు ($60,227.84 మిలియన్లు)
  9. భారతదేశం – 822.09 టన్నులు ($58,527.34 మిలియన్లు)
  10. నెదర్లాండ్స్ – 612.45 టన్నులు ($43,602.77 మిలియన్లు)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి