ప్రపంచ స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం(Inflation) దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర(sugar) ఎగుమతుల(Exports)పై ప్రభుత్వం పరిమితి విధించనుంది. దేశీయ ధరల పెరుగుదలకు చెక్ పెట్టేందుకు ఆరేళ్లలో తొలిసారిగా భారత్‌లో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించాలని భావిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ఈ సీజన్ ఎగుమతిని 10 మిలియన్ టన్నులకు పరిమితం చేయవచ్చు. ఈ ఏడాది చక్కెర ఎగుమతి 9 మిలియన్ టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరంలో 8.5 మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. గతేడాది 71.91 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి అయింది. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగనుంది.
దేశీయ మార్కెట్‌లో గోధుమల ధరలు పెరిగిన తర్వాత ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధం విధించింది. దేశంలో చక్కెర ధరల పెరుగుదలను ఆపడానికి, ప్రభుత్వం ఇప్పుడు చక్కెర ఎగుమతులపై పరిమితులను విధించనుంది. చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించే అవకాశం ఉండటంతో చక్కెర కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. బలరాంపూర్ చిని షేర్లు 10 శాతం, శ్రీ రేణుకా షుగర్ షేర్లు 14 శాతం వరకు పడిపోయాయి. మరోవైపు ధంపూర్ షుగర్ 5 శాతం, శక్తి షుగర్స్ 7 శాతం, బజాజ్ హిందుస్థాన్ షుగర్ 4 శాతం పడిపోయాయి. ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేషియా, ఆఫ్రికన్ దేశాలు ప్రధాన దిగుమతి దేశాలు. 2017-18, 2018-19, 2019-20 మార్కెటింగ్ సంవత్సరాల్లో వరుసగా 6.2 లక్షల టన్నులు, 38 లక్షల టన్నులు మరియు 59.60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేయబడింది. 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో 70 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేయబడింది.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…