Cement Prices: కొత్త ఇల్లు కట్టుకునే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జూన్‌ నుంచి పెరగనున్న సిమెంట్‌ ధరలు.. ఎంత అంటే..!

|

May 29, 2022 | 9:38 AM

Cement Prices: ధరలు పెరుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది. ఒక వైపు నిత్యవసరాల సరుకుల ధరలతో పాటు అన్నింటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో..

Cement Prices: కొత్త ఇల్లు కట్టుకునే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జూన్‌ నుంచి పెరగనున్న సిమెంట్‌ ధరలు.. ఎంత అంటే..!
Follow us on

Cement Prices: ధరలు పెరుదలతో సామాన్యుడికి భారంగా మారుతోంది. ఒక వైపు నిత్యవసరాల సరుకుల ధరలతో పాటు అన్నింటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తంటి కల సాకారం చేసుకునే వారికి తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పుడు మళ్లీ సిమెంట్‌ ధరలు పెరగనున్నాయి. ప్రముఖ సిమెంట్ కంపెనీ ఇండియా సిమెంట్స్ (India Cements) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై నుంచి ఆయా కంపెనీలు విడత వారిగా ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ధరలు రూ. 55 మేర పెరగనున్నట్లు సమాచారం. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పైకి చేరడం వల్ల ధరల పెంచాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంటోంది. జూన్ 1 నుంచి సిమెంట్ బస్తా రేటు రూ. 20 పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. అలాగే జూలై 1 నుంచి సిమెంట్ రేటు రూ. 20 పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా సిమెంట్ బస్తా రేటు రూ. 55 మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీని వల్ల కొత్త ఇల్లు కట్టుకునే వారికి తీప్ర భావం పడనుంది. కాగా ధరల పెంపు వల్ల సిమెంట్ అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇండియా సిమెంట్‌ తాజాగా ఆర్థిక ఫలితాలు కూడా వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు రూ.230 కోట్లకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో రూ.71.6 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు ఫలితాలు వెల్లడించాయి. అదే టైమ్‌లో కంపెనీ ఆదాయం కూడా 4 శాతం క్షీణించింది. రూ. 1449 కోట్ల నుంచి రూ. 1391 కోట్లకు క్షీణించింది. కంపెనీ వ్యయాలు 2.5 శాతం మేర పెరిగాయి. రూ. 1459 కోట్లుగా ఉన్నాయి. ఈ కారణంగానే ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత దేశంలో ఇండియా సిమెంట్ అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీగా కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి