Tiktok: దూసుకెళ్లిన టిక్‌టాక్‎.. గూగుల్‎ను వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలిచిన చైనా కంపెనీ..

|

Dec 26, 2021 | 10:31 AM

టిక్‌టాక్‎ను ఇండియాలో నిషేధించినా.. పాపులారిటీ పరంగా.. ఈ చైనా కంపెనీ గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద కంపెనీలను దాటేసింది.

Tiktok: దూసుకెళ్లిన టిక్‌టాక్‎.. గూగుల్‎ను వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలిచిన చైనా కంపెనీ..
Tiktok
Follow us on

టిక్‌టాక్‎ను ఇండియాలో నిషేధించినా.. పాపులారిటీ పరంగా.. ఈ చైనా కంపెనీ గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్ వంటి పెద్ద కంపెనీలను దాటేసింది. టిక్‌టాక్ 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్‌గా నిలించినట్లు ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్‌ఫ్లేర్ ఓ నివేదికను విడుదల చేసింది. అమెరికన్ కంపెనీ గూగుల్ కంటే టిక్‌టాక్ ఎక్కువ హిట్స్‎ను పొందిందని క్లౌడ్‌ఫ్లేర్ నివేదిక పేర్కొంది. టిక్‌టాక్ అనేది వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్. ఈ ప్లాట్‌ఫారమ్ యాజమాన్యం చైనీస్ కంపెనీ బైటెడెన్స్‌తో ఉంది.

ప్రపంచంలోని మిలియన్ల మంది వ్యక్తులు చిన్న వీడియోలను రూపొందించడానికి టిక్‌టాక్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే, భారత్‎లో టిక్‌టాక్‎ను నిషేధించారు. క్లౌడ్‌ఫ్లేర్ ర్యాంకింగ్ ప్రకారం, టిక్‌టాక్ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్‌లో గూగుల్‌ను వెనక్కు నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి వరుసగా నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతోందని నివేదిక వివరించింది. గతంలో గూగుల్ టాప్ పొజిషన్‌లో ఉండేది.

టాప్ 10 జాబితాలో, TikTok తర్వాత Google, Facebook, Microsoft, Apple, Amazon, Netflix, YouTube, Twitter, WhatsApp ఉన్నాయి.

టిక్‌టాక్‎కు ప్రజాదరణ పెరగడానికి కరోనా మహమ్మారి కారణమని నివేదికలో పేర్కొన్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో టిక్‌టాక్ ప్లాట్‌ఫారమ్‌ను తీవ్రంగా ఉపయోగించారు. చైనా బైట్‌డాన్స్ ఈ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‎ క్రియాశీల వినియోగదారుల సంఖ్య ఒక బిలియన్ దాటింది. దీని వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Read Also.. Stock Market: స్టాక్స్‎లో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి..