Credit Debit Cards: ఇక క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటాను దొంగిలించలేరు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు

|

Apr 22, 2024 | 6:25 PM

క్రెడిట్‌, డెబిట్ కార్డులను ఉపయోగించడం రాబోయే రోజుల్లో చాలా సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతుంది. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ గత కొద్ది రోజులుగా ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం నిబంధనలు కూడా మారుస్తున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం గతంలో కంటే మరింత సురక్షితంగా ఉండే విధంగా ఇప్పుడు..

Credit Debit Cards: ఇక క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటాను దొంగిలించలేరు.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
Credit Debit Cards
Follow us on

క్రెడిట్‌, డెబిట్ కార్డులను ఉపయోగించడం రాబోయే రోజుల్లో చాలా సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతుంది. సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ గత కొద్ది రోజులుగా ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం నిబంధనలు కూడా మారుస్తున్నారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వినియోగం గతంలో కంటే మరింత సురక్షితంగా ఉండే విధంగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది.

నిబంధనలు ఎప్పుడు వర్తిస్తాయి?

చెల్లింపు అగ్రిగేటర్ కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డ్ సమాచారాన్ని సేవ్ చేయదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెబుతోంది. సెంట్రల్ బ్యాంక్ లావాదేవీల సౌలభ్యంపై కసరత్తు చేస్తోంది. అందుకోసం ప్రత్యేక టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ఇందుకోసం సర్క్యులర్ కూడా జారీ చేసింది. దీని ప్రకారం, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సమాచారాన్ని నిలుపుకోవడానికి సంబంధించిన నియమం ఆగస్టు 1, 2025 నుండి అమలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రతిపాదిత నియమం ఏమి చెబుతుంది?

కొత్త నిబంధనల ప్రకారం.. చెల్లింపు అగ్రిగేటర్ కంపెనీలు కస్టమర్ల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరణాత్మక సమాచారాన్ని సేవ్ చేయలేని విధంగా ఏర్పాటు చేస్తోంది ఆర్బీఐ. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. చెల్లింపు అగ్రిగేటర్ కంపెనీలు కస్టమర్‌ల డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఫైల్, సీఓఎఫ్‌ నిల్వ చేయలేరు. దానికి ఎలాంటి ఆమోదం లభించదు. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, కస్టమర్ కార్డ్ గురించిన సమాచారం కార్డ్ జారీ చేసేవారికి, కార్డ్ నెట్‌వర్క్‌కు మాత్రమే తెలుస్తుంది. వినియోగదారునికి చెందిన క్రెడిట్‌, డెబిట్‌కార్డు వివరాలను దొంగిలించేందుకు, వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినా వీలుకాని విధంగా చర్యలు చేపడుతోంది ఆర్బీఐ.

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఖాతాదారులకు బ్యాంకులు జారీ చేస్తాయి. కార్డ్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు వీసా, మాస్టర్ కార్డ్, డైనర్స్ క్లబ్, రూపే మొదలైనవి. అంటే ఆగస్టు 1, 2025 నుండి బ్యాంక్‌లు, వీసా, మాస్టర్ కార్డ్, డైనర్స్ క్లబ్, రూపే వంటి కార్డ్ నెట్‌వర్క్ ప్రొవైడర్లు మాత్రమే తమ వద్ద ఫైల్ డేటాలో కార్డ్‌లను ఉంచుకోగలరు.

రూల్స్ ఫైనల్ కావు

ఈ నిబంధనలను ఆర్‌బీఐ ఇంకా ఖరారు చేయలేదు. ఈ నిబంధనల ముసాయిదా సిద్ధమైంది. ఇప్పుడు ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తారు. వారి సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం నిబంధనలు ఖరారు చేస్తారు. ఆ తర్వాత నిబంధన అమలులోకి వస్తుంది.