Pension Scheme: రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌

|

Aug 29, 2024 | 9:03 AM

ప్రతి ఒక్కరికీ పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. పొదుపు లేకుంటే నిధుల లేమి, అప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గ్రహించిన వారంతా పొదుపు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛను అందజేస్తుంది. కానీ, స్వయం ఉపాధి పొందే వారికి, ప్రైవేట్ రంగంలో..

Pension Scheme: రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌.. మోడీ సర్కార్‌ బెస్ట్‌ స్కీమ్‌
Pension Scheme
Follow us on

ప్రతి ఒక్కరికీ పొదుపు ముఖ్యం. ఎందుకంటే పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉంటుంది. పొదుపు లేకుంటే నిధుల లేమి, అప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గ్రహించిన వారంతా పొదుపు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పింఛను అందజేస్తుంది. కానీ, స్వయం ఉపాధి పొందే వారికి, ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అలాంటి సౌకర్యం లేదు. కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను అమలు చేస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ రూ.7 చెల్లించడం ద్వారా, మీరు నెలకు రూ.5,000 సంపాదించవచ్చు.

అటల్ పెన్షన్ యోజన అనేది జీతాలు తీసుకునే కార్మికులు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు హామీ ఇవ్వబడిన నెలవారీ ప్రణాళిక. ఈ ప్రాజెక్ట్ 2015 సంవత్సరంలో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు 7 కోట్ల మంది లబ్ధి పొందడం విశేషం.

ఇది కూడా చదవండి: Public Holidays: సెప్టెంబరు 7, 16న పబ్లిక్‌ హాలిడేస్‌.. విద్యార్థులకు వరుస సెలవులు.. ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి

అటల్ పెన్షన్ యోజన ప్రత్యేకతలు ఏమిటి ?

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెట్టే వ్యక్తి నెలకు కనీసం రూ.210 పెట్టుబడి పెట్టవచ్చు. అంటే రోజూకు రూ.7 చొప్పున పడుతుంది.నెలకు రూ.210 ఆదా చేయడం ద్వారా 60 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 పొందుతారు. చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని బట్టి పెన్షన్ మొత్తం పెరుగుతుందని గమనించండి.

60 ఏళ్ల వయస్సులో నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే, మీరు 18 ఏళ్ల వయస్సు నుండి నెలకు రూ.210 డిపాజిట్‌ చేయాలి. మీరు నెలవారీ మాత్రమే కాకుండా 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి కూడా చెల్లించవచ్చు. దీని ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాల్సి వస్తే రూ.626 చెల్లించాలి. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి చెల్లించాలంటే రూ.1,239 చెల్లించాల్సి రావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: PAN: తండ్రి పేరు లేకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాదా? వివరణ ఇచ్చిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి