Driving License: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా పర్లేదు.. ఇదొక్కటి చాలు.!

వాహనంతో రోడ్డెక్కాలంటే.. కచ్చితంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీస్తారు. బండికి చలానా పడుతుంది.

Driving License: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా పర్లేదు.. ఇదొక్కటి చాలు.!
Traffic Rules

Updated on: Apr 30, 2023 | 9:48 AM

వాహనంతో రోడ్డెక్కాలంటే.. కచ్చితంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లేదంటే ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీస్తారు. బండికి చలానా పడుతుంది. మరి ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇంట్లో మర్చిపోయినప్పుడు.. ట్రాఫిక్ తనిఖీల్లో చిక్కుకున్నట్లయితే.? అప్పుడెలా పోలీసుల నుంచి తప్పించుకుంటారు.! మీ దగ్గర లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా పర్లేదు. ఈ ఒక్క యాప్ చాలు.. మీకు చలానా అస్సలు పడదు.

ఆ యాప్ ‘డిజిలాకర్’.. ఇందులో మీరు మీ ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్.. ఇలా ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా సులభంగా ఈ యాప్‌లో సేవ్ చేయవచ్చు. మీరెప్పుడైనా ట్రాఫిక్ తనిఖీల్లో చిక్కుకున్నప్పుడు.. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా.. ఈ డిజిలాకర్ యాప్‌లో ఉన్న హార్డ్ కాపీ చూపిస్తే చాలు.

కాగా, డిజిటల్ ఇండియా నేపధ్యంలో కేంద్రం వాహనానికి అవసరమయ్యే అన్ని డాక్యుమెంట్స్ ఒకే చోట ఉండేలా పలు యాప్‌లను సిద్దం చేసింది. అవే Digilocker, mParivahan. 2018లో భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.