Indian Railway: మీరు ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం అయినప్పుడు.. కేవలం రూ.40లతో ఈ లగ్జరీ వసతులను పొందవచ్చు..

|

Jan 22, 2023 | 7:57 PM

శీతాకాలంలో రైలు 2, 4 లేదా కొన్నిసార్లు 8 గంటలు కూడా ఆలస్యం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కేవలం 20 నుంచి 40 రూపాయలకే మంచి గదిలో ఉండొచ్చు.

Indian Railway: మీరు ప్రయాణించాల్సిన రైలు ఆలస్యం అయినప్పుడు.. కేవలం రూ.40లతో ఈ లగ్జరీ వసతులను పొందవచ్చు..
Indian Railways
Follow us on

భారతీయ రైల్వేలు ప్రయాణికుల కోసం ఎన్నో కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తోంది రైల్వేశాఖ. రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను ప్రారంభించింది. ఈ రోజు మనం భారతీయ రైల్వే అటువంటి సదుపాయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. దీని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీరు వేల రూపాయలు ఆదా చేయవచ్చు. అవును, ఇది శీతాకాలం, పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యమవుతున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కూడా ఈ మధ్య కాలంలో రైలు ప్రయాణం చేయబోతున్నట్లయితే.. ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం రైల్వే సౌకర్యం గురించి మీకు తెలియజేస్తాం. దీని ద్వారా ప్రయాణీకులు కేవలం రూ. 20 నుంచి రూ. 40లకు విలాసవంతమైన గదులను పొందవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

రైలు ఆలస్యమైనప్పుడు..

చలికాలంలో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, రైలు 2, 4 లేదా కొన్నిసార్లు 8 గంటలు కూడా ఆలస్యం అవుతుందని ప్రయాణికులు తెలిసిపోతోంది. అలాంటి పరిస్థితిలో కొంతమంది హోటల్‌లో ఖరీదైన గదిని బుక్ చేసుకుంటారు. కానీ చాలా మంది అదే స్టేషన్‌లో చల్లని గాలిలో రైలు కోసం వేచి ఉంటారు. అయితే, మీరు కూడా రైల్వే  రిటైరింగ్ గదిని సద్వినియోగం చేసుకోవచ్చు. దీని కోసం మీకు PNR నంబర్ అవసరం, మీరు 48 గంటల పాటు ఇక్కడ ఉండగలరు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీరు చాలా తక్కువ ఛార్జీని చెల్లిస్తే సరిపోతుంది. దీని కోసం మీ నుంచి కేవలం రూ.20 నుంచి రూ.40 వరకు మాత్రమే చార్జీ తీసుకుంటారు.

రిటైరింగ్ గదిని ఎలా బుక్ చేసుకోవాలి?

వాస్తవానికి, దీని కోసం మీరు PNR నంబర్‌ను కలిగి ఉండాలి. మీరు పెద్ద స్టేషన్లలో AC , నాన్ AC గదులను కూడా పొందుతారు. దీన్ని బుక్ చేసుకోవడానికి.. మీరు వెబ్‌సైట్‌లో  ని సందర్శించాలి. గుర్తుంచుకోండి! టిక్కెట్లు కన్ఫర్మ్ అయిన లేదా RAC ఉన్న ప్రయాణికులు మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

సాధారణ టిక్కెట్‌పై ఉన్న వారికి కూడా సదుపాయం

మీరు 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించబోతున్నట్లయితే.. సాధారణ టిక్కెట్‌పై కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఒక PNR నంబర్‌తో ఒక గది మాత్రమే రిజర్వ్ చేసుకోవచ్చనే విషయాన్ని గుర్తించుకోండి. ఇక్కడ బుకింగ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సిస్టమ్ ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న తర్వాత.. అక్కడికి చేరుకుని ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వంటి ప్రభుత్వ పత్రాల కోసం మిమ్మల్ని అడుగుతారని గుర్తుంచుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం