Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!

|

Apr 04, 2022 | 4:22 PM

Gas Cylinder: భారత ప్రభుత్వం ఉజ్వల పథకం కింద దేశంలోని నిరుపేదలకు గ్యాస్‌ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రజలు కట్టెలకు బదులుగా గ్యాస్‌

Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!
Follow us on

Gas Cylinder: భారత ప్రభుత్వం ఉజ్వల పథకం కింద దేశంలోని నిరుపేదలకు గ్యాస్‌ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రజలు కట్టెలకు బదులుగా గ్యాస్‌ సిలిండర్లని వినియోగిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లతో వంట చేయడం చాలా సులువు. అంతేకాదు మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వంట చేస్తారు. దీంతో పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. గతంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైన పని. గంటల తరబడి లైన్లో నిలబడి గ్యాస్ సిలిండర్లని బుక్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎల్‌పిజి సిలిండర్ల బుకింగ్‌లో ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది. మీరు ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్‌ను నాలుగు పద్దతుల్లో సులభంగా బుక్ చేసుకోవచ్చు.

ఫోన్‌ కాల్ ద్వారా

మీరు మీ మొబైల్ ద్వారా గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సులభంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు కంపెనీ జారీ చేసిన ట్రోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. మీ కస్టమర్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మీ సిలిండర్ బుక్‌ అవుతుంది. తర్వాత 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

మెసేజ్ ద్వారా గ్యాస్ బుకింగ్

మీరు మొబైల్ లో మెసేజ్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. దీని కోసం మీరు గ్యాస్ ఏజెన్సీ పేరు, పంపిణీదారు పేరు, ఫోన్ నంబర్, STD కోడ్, సిటీ కోడ్, IVRS నంబర్‌ను నమోదు చేసి కంపెనీ నంబర్‌కి పంపాల్సి ఉంటుంది. దీని తర్వాత గ్యాస్ బుక్ అయినట్లు మీ సెల్‌కి మెస్సేజ్ వస్తుంది. తర్వాత 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

వెబ్‌సైట్ ద్వారా గ్యాస్‌ బుకింగ్

ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ఆన్‌లైన్‌ ద్వారా కూడా చేయవచ్చు. ఇందుకోసం మీరు Mylpg.in వెబ్‌సైట్‌కి వెళ్లి 17 అంకెల కస్టమర్ IDని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేరు, చిరునామా తదితర వివరాలను నింపాలి. తర్వాత మీ గ్యాస్ బుకింగ్ పూర్తవుతుంది.

Whatsapp ద్వారా బుకింగ్ 

ఇప్పుడు కొత్తగా వాట్సాఫ్‌ ద్వారా కూడా గ్యాస్‌ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నంబర్ నుంచి 7588888824 నంబర్‌కి గ్యాస్‌ వివరాలు వాట్సాప్ చేయాలి. తర్వాత మీ గ్యాస్ సిలిండర్ బుక్‌ అవుతుంది. 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది.

CLAT Exam 2022: జూన్‌లో CLAT పరీక్ష.. పరీక్షా సరళి, సిలబస్ గురించి తెలుసుకోండి..!

AP Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం

Sri Lanka Crisis: అయ్యా.. మా దేశాన్ని రక్షించండి.. ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత విజ్ఞప్తి