IDFC First Bank: షాకింగ్..ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కీలక ప్రకటన.. ఇకపై జీరో ఫీ బ్యాంకింగ్ సేవలు

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అందులోని నగదు వివిధ సేవల పేరుపై కోల్పోతున్నారా? అయితే మీరు ఈ బ్యాంకు ఖాతా తీసుకుంటే వివిధ రకలైన 25 సేవా రుసుముల బారి నుంచి బయటపడవచ్చు...

IDFC First Bank: షాకింగ్..ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కీలక ప్రకటన.. ఇకపై జీరో ఫీ బ్యాంకింగ్ సేవలు
Idfc First Bank

Edited By: Subhash Goud

Updated on: Dec 18, 2022 | 5:09 PM

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అందులోని నగదు వివిధ సేవల పేరుపై కోల్పోతున్నారా? అయితే మీరు ఈ బ్యాంకు ఖాతా తీసుకుంటే వివిధ రకలైన 25 సేవా రుసుముల బారి నుంచి బయటపడవచ్చు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటో తెలుసా? అదే ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్. ఈ బ్యాంక్ పొదుపు ఖాతాల నిర్వహణ కోసం ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. ఇది తమ బ్యాంక్ జీరో బ్యాంకింగ్ విధానమని అలాగే సాధారణంగా ఉపయోగించే 25 సేవలపై బ్యాంకింగ్ చార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.  నగదు డిపాజిట్, ఉపసంహరణ, ఆర్టీజీఎస్, నెఫ్ట్, చెక్ బుక్, ఎస్ ఎంఎస్ అలర్ట్ చార్జీలు, ఏటీఎం నిర్వహణ చార్జీల వంటివి మాఫీ చేసిన జాబితా ఉన్నాయి. 

డిసెంబర్ 18 బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ఈ మాఫీ సేవలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. నెలకు 10,000 రూపాయల సగటు నెలవారీ బ్యాలెన్స్ తో పాటు 25,000 రూపాయల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ పొందేవారే ఈ మాఫీ సేవలను పొందగలరని పేర్కొన్నారు. ఈ జీరో ఫీ బ్యాంకింగ్ సేవల వల్ల కస్టమర్లు ప్రశాంతంగా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని వివరిస్తున్నారు. 

ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ లో జీరో ఫీ సేవలివే

సొంత శాఖ, లేదా ఇతర శాఖల్లో నగదు డిపాజిట్లు, ఉప సంహరణ చార్జీలు, ఏటీఎం, థర్డ్ పార్టీ క్యాష్ ట్రాన్సాక్షన్లు, డీడీ చార్జీలు, ఐఎంపీఎస్, నెఫ్ట్ , ఆర్టీజీఎస్ సేవా రుసుములు, బుక్ చార్జీలు, ఎస్ఎంఎస్, డ్లూప్లికెట్ స్టేట్ మెంట్, పాస్ బుక్, బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, ఖాతా మూసివేత, ఈసీఎస్, ఇంటర్నేషనల్ ఏటీఎం/పీఓఎస్ చార్జీలు, స్టాండింగ్ ఇన్ స్టక్షన్ల చార్జీలు, మేనేజర్ల చెక్ లిస్ట్ చార్జీలు, ఫొటో అటెస్టేషన్, సంతకం అటెస్టేషన్, పాత రికార్డులు, చిరునామా నిర్ధారణ చార్జీలను ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ పూర్తిగా మాఫీ చేసింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం